నాగోల్ భూపతి హై స్కూల్ 2025 పదవ తరగతి ఫలితాల్లో విద్యార్థులు ప్రభంజనం

నాగోల్ భూపతి హై స్కూల్ 2025 పదవ తరగతి ఫలితాల్లో విద్యార్థులు ప్రభంజనం

నాగోల్ డివిజన్‌లోని మమతా నగర్ కాలనీ రోడ్ నెంబర్ 4లో ఉన్న భూపతి హై స్కూల్ 2025 తెలంగాణ రాష్ట్ర పదవ తరగతి ఫలితాల్లో 100 శాతం ఉత్తీర్ణత సాధించి సంచలనం రేపింది. ఈ విజయంతో స్కూల్ విద్యారంగంలో మరో మైలురాయిని చేరుకుంది. విద్యార్థుల అత్యుత్తమ ప్రతిభతో 589 మార్కులతో రాష్ట్ర స్థాయిలో రాణించి నాగోల్ డివిజన్‌లో మొదటి స్థానాన్ని అందుకుంది.ఈ ఫలితాల్లో పి. సంజన 589 మార్కులతో స్కూల్ టాపర్‌గా నిలవగా, ఎం. సత్య ప్రణవిక 556, ఉమ్మ కులుసం 556, బాలు విష్ణు 550, టీ. మణికుమార్ 541, విష్ణు శ్రీ 538, ఎన్. వనిషిత్ కుమార్ 538, ఎల్. శశాంక్ గౌడ్ 534, శ్రీధర్ 524, సిహెచ్. మేఘన 523, ప్రీతి కుమారి 511 మార్కులతో కృషిని చాటారు. మిగతా విద్యార్థులందరూ 500కు పైగా మార్కులు సాధించడం విశేషం.ఈ సందర్భంగా భూపతి హై స్కూల్ ప్రిన్సిపాల్ ప్రేమా డేవిడ్, డైరెక్టర్ శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ “భూపతి హై స్కూల్‌ను 1991లో స్థాపించాం. గత 35 ఏళ్లుగా విద్యార్థులకు ఉత్తమ విద్యను అందించాలన్న దృక్పథంతో ముందుకు సాగుతున్నాం. ఆధునిక భవనాలు, కంప్యూటర్ ల్యాబ్, సైన్స్ ల్యాబ్స్, లైబ్రరీ, స్పోర్ట్స్ ఫెసిలిటీలు వంటి అన్ని వసతులతో విద్యార్థులకు సమగ్ర అభివృద్ధిని కల్పిస్తున్నాం. అనుభవజ్ఞులైన టీచర్లు, సాంకేతిక ఆధారిత బోధన విధానాలు, మంచి క్రమశిక్షణ, విలువలు, స్పోకెన్ ఇంగ్లిష్ శిక్షణ మొదలైనవి ప్రతి విద్యార్థికి ఉపయోగపడుతున్నాయి” అని తెలిపారు.పదో తరగతిలో ఉత్తమ ఫలితాల సాధనకు ప్రత్యేక శిక్షణా తరగతులు, వారంవారీ పరీక్షలు, అందరికీ వ్యక్తిగత దృష్టితో మెరుగైన ప్రదర్శన సాధించేలా మద్దతిస్తున్నామన్నారు. మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీలో ప్రత్యేక శిక్షణకు కార్పొరేట్ కాలేజీల ఫ్యాకల్టీ గెస్ట్ లెక్చర్లు అందిస్తున్నామని, ఐఐటి, నీట్ కోర్సులకు మౌలిక శిక్షణ ఇవ్వడమే కాకుండా స్పోర్ట్స్, గేమ్స్ వంటి సహపాఠ్య కార్యకలాపాలకూ సమాన ప్రాధాన్యం ఇస్తున్నట్లు చెప్పారు.నర్సరీ నుండి పదవ తరగతి వరకు అన్ని తరగతులకు ట్రాన్స్ పోర్ట్ సౌకర్యం కల్పిస్తున్నామని, నూతన విద్యా సంవత్సరం 2025–26కి అడ్మిషన్లు ప్రారంభమయ్యాయని వెల్లడించారు. విద్యా, క్రీడా రంగాల్లో సమగ్ర అభివృద్ధి కోసం తమ సంస్థ కృషి చేస్తున్నదన్నారు.ఈ విజయాన్ని పురస్కరించుకుని నిర్వహించిన కార్యక్రమంలో ఉపాధ్యాయ బృందం, విద్యార్థులు, తల్లిదండ్రులు, సిబ్బంది పాల్గొని ఆనందాన్ని పంచుకున్నారు.

Tags:

About The Author

NAGARA NIJAM Picture

ప్రజల సమస్యలపై సామాజిక రాజకీయ వ్యాపార విశ్లేషణ పై తెలంగాణ ఆంధ్రప్రదేశ్ జాతీయ అంతర్జాతీయ వార్తలను మీ ముందుకు వచ్చిన నగర నిజం 
న్యూస్ పోర్టల్

Latest News

నూతన వధూవరులను ఆశీర్వదించిన ఎంపీ ఆర్ కృష్ణయ్య యాదవ్ నూతన వధూవరులను ఆశీర్వదించిన ఎంపీ ఆర్ కృష్ణయ్య యాదవ్
మేడ్చల్ వివాహ వేడుకల్లో బీసీ సంక్షేమ సంఘాం అధ్యక్షులు, రాజ్యసభ సభ్యులు ఆర్. కృష్ణయ్య పాల్గొన్ని నూతన వధూవరులను ఆశీర్వదించారు. శుక్రవారం మేడ్చల్ మున్సిపల్ పట్టణ పరిధిలోని...
నాగోల్ లో సింధూర్ ఆపరేషన్ విజయోత్సవం సందర్భంగా రామాలయంలో పూజలు
పలు గ్రామాలలో ఘనంగా రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు కార్యక్రమం
 అక్రమ నిర్మాణాలకు కేరాఫ్ అడ్రస్ పెద్ద అంబర్పేట్ మున్సిపాలిటీ
చెత్త కుప్పలు ఎత్తడంలో నిర్లక్ష్యం ఎందుకు
మేడ్చల్ ఏ.సి.పి శ్రీనివాస్ రెడ్డి బదిలీ
రాష్ట్రస్థాయిలో ఉత్తమ అవార్డు అందుకున్న డి.ఆర్.డిఎ.పిడి.శ్రీలత