ఇంటర్ అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షల క్లాసులను పరిశీలించిన అధికారులు
నల్లగొండ, మే 6 , ( నగర నిజం) :నకిరేకల్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్ అడ్వాన్స్ సప్లమెంటరీ పరీక్షల కోసం జరుగుతున్న క్లాసులను బోర్డు అధికారి భీమ్ సింగ్, నల్లగొండ జిల్లా డి ఐ ఈ ఓ దస్రు నాయక్ మంగళవారం క్షేత్రస్థాయిలో కలిసి సందర్శించారు. అనంతరం కళాశాల ప్రిన్సిపల్ చామల మల్లారెడ్డి ఆధ్వర్యంలో క్లాసులను పరిశీలించి అధ్యాపకుల యాక్షన్ ప్లాన్ స్వీకరించి వారికి తగు సలహాలు సూచనలు అందించారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపల్ చామల మల్లారెడ్డి మాట్లాడుతూ.. రాబోయే విద్యా సంవత్సరానికి కళాశాలకు కావలసిన మౌలిక సదుపాయాలు, అదనపు సెక్షన్లు, అదనపు గ్రూపులకి కావలసిన అధ్యాపకులను అందించడానికి కమిషనర్ కృష్ణ ఆదిత్య ఐఏఎస్ సానుకూలంగా స్పందించారని తెలిపారు. అలాగే ఈ సంవత్సరం పదవ తరగతిలో ఉత్తీర్ణత పొందిన విద్యార్థులు ప్రభుత్వ కళాశాలలో అడ్మిషన్ తీసుకోని, ప్రభుత్వ కళాశాలల ను ప్రోత్సహిస్తు.. ఇతర విద్యార్థులకు ఆదర్శంగా నిలవాలని కోరారు. ఈ కార్యక్రమంలో నకిరేకల్ జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ చామల మల్లారెడ్డి, అధ్యాపకులు శ్రీనివాస్, రామకృష్ణ, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
About The Author

ప్రజల సమస్యలపై సామాజిక రాజకీయ వ్యాపార విశ్లేషణ పై తెలంగాణ ఆంధ్రప్రదేశ్ జాతీయ అంతర్జాతీయ వార్తలను మీ ముందుకు వచ్చిన నగర నిజం
న్యూస్ పోర్టల్