రాజీవ్ యువ వికాసం పథకం లో వచ్చిన దరఖాస్తుల పై మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కలెక్టరు గౌతం సమీక్షా సమావేశం
తెలంగాణ ప్రభుత్వం యువతకు స్వయం ఉపాధి కల్పించాలనే సదుద్దేశంతో ప్రవేశపెట్టిన రాజీవ్ యువ వికాసం పథకం లో వచ్చిన దరఖాస్తుల పై మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కలెక్టరు గౌతం జిల్లా సంక్షేమ శాఖ అధికారులు, మున్సిపల్ కమీషనర్లు, ఎంపిడిఓలతో కలిసి మంగళవారం సమీక్షా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా కలెక్టరు మాట్లాడుతూ అర్హులైన ప్రతి ఒక్కరికి ఈ పథకం ద్వారా లబ్దిచేకూరేలా దరఖాస్తులను పరిశీలించాలని సంబంధిత అధికారులకు సూచించారు. మండలాల వారీగా ఎన్నెన్ని దరఖాస్తులు వచ్చాయని వాటిలో పరిశీలించినవి ఎన్నని కలెక్టరు అడిగి తెలుసుకున్నారు. పరిశీలనలో ఎలిజిబిలిటి ఉన్న దరఖాస్తులను బ్యాంకర్స్ లాగిన్ లోకి పంపాలని, ఆన్ లైన్ లో అప్ లోడ్ చేయని అవసరమైన సర్టిఫికెట్ల కోసం అభ్యర్థలకు ఫోన్ చేసి తెప్పించుకొని బ్యాంకర్స్ లాగిన్ కి పంపాలని, పూర్తి అర్హత లేని దరఖాస్తులను పెండింగ్ లో పెట్టాలని, ఏవి కూడా రిజెక్టు చేయకూడదని కలెక్టరు తెలిపారు. బ్యాంకర్స్ తప్పనిసరిగా సిబిల్ స్కోర్ వెరిఫై చేయాలని సూచించారు. అయితే ఇందులో మొదటి,రెండవ కేటగిరిలకు సిబిల్ స్కోర్ అవసరం లేదని, 3, 4 కేటగిరిలలోని ధరఖాస్తులకు మాత్రం తప్పకుండా సిబిల్ స్కోర్ పరిశీలించాలన్నారు. ఒక మున్సిపాలిటివి వేరొక మున్సిపాలిటిలో కి, అదేవిధంగా ఒక వర్గానికి సంబంధించినవి వెరొక వర్గంలోకి దరఖాస్తు వచ్చి ఉంటే వాటిని వెంటనే సంబంధిత మున్సిపాలిటికి, సంబంధిత వర్గాలకు ఆన్ లైన్ లో పంపాలన్నారు. ఎంపికైన దరఖాస్తుల సెలెక్షన్ లిస్టులను వెంటవెంటనే పంపాలని అధికారులకు సూచించారు. వచ్చినవి, పెండింగ్ లో ఉన్న దరఖాస్తులను మండలాల వారీగా కలెక్టరు పరిశీలించారు. ఈ ప్రక్రియలో ఎదురయ్యే సమస్యలను కలెక్టరు దృష్టికి తీసుకురాగా, అవసరమైన సలహాలను సూచనలను కలెక్టరు అధికారులకు సూచించారు. దరఖాస్తులను జాగ్రత్తగా పరిశీలించాలని, ధరఖాస్తుల ఎంపిక ప్రక్రియలో పూర్తి బాధ్యత అధికారలదేనని కలెక్టరు స్పష్టం చేసారు.
అనంతరం ఇందిరమ్మ ఇండ్ల పథకానికి వచ్చిన దరఖాస్తులను పంశీలించి లబ్దిదారుల ఎంపిక ప్రక్రియ పై సంబంధిత అధికారులతో సమీక్షించారు. ఇందిరమ్మ ఇండ్ల పధకంలో భాగంగా లబ్దిదారుల ఎంపిక ప్రక్రియను మరింత వేగవంతం చేయాలని కలెక్టరు ఆదేశించారు. లబ్దిదారుల ఎంపిక ఎంతవరకు పూర్తయితే అంతవరకు ఏరోజుకారోజు లబ్దిదారుల జాబితాను ఆన్ లైన్ లో తనకు పంపాలని కలెక్టరు సూచించారు.ఈ సమావేశంలో జెడ్పిసిఈఓ కాంతమ్మ, డిఆర్డిఓ సాంబశివరావు, జిల్లా ఎస్సీ సంక్షేమ శాఖ అధికారి వినోద్ కుమార్, బిసి సంక్షేమ శాఖాధికారి విజయలక్ష్మి, ఎస్సీ కార్పొరేషన్ఈడి బాబు మోసిస్, ఎల్డిఎం, జిల్లా మైనార్టీ వెల్పేర్ అధికారి, హౌజింగ్ఈడిరమణ మూర్తి, మున్సిపల్ కమీషనర్లు, ఎంపిడిఓలు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.
About The Author

ప్రజల సమస్యలపై సామాజిక రాజకీయ వ్యాపార విశ్లేషణ పై తెలంగాణ ఆంధ్రప్రదేశ్ జాతీయ అంతర్జాతీయ వార్తలను మీ ముందుకు వచ్చిన నగర నిజం
న్యూస్ పోర్టల్