సినిమా - Nagaranijam

నిర్మాత శ్రీనివాస్ పుట్టినరోజు సందర్భంగా ఘనంగా "నిశ్శబ్ద" సినిమా టీజర్ లాంఛ్
మనోజ్ కుమార్, ఆశిత రెడ్డి హీరో హీరోయిన్లుగా నటిస్తున్న సినిమా "నిశ్శబ్ద". ఈ చిత్రాన్ని శ్రీ రిషి సాయి ప్రొడక్షన్ బ్యానర్‌పై శ్రీనివాస్, ఎం.సంధ్యారాణి నిర్మిస్తున్నారు. హారర్ థ్రిల్లర్ కథతో దర్శకుడు రమణమూర్తి తంగెళ్లపల్లి రూపొందిస్తున్నారు. చిత్రీకరణ పూర్తి చేసుకున్న "నిశ్శబ్ద" సినిమా త్వరలో గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది. ఈ రోజు నిర్మాత శ్రీనివాస్ పుట్టినరోజు సందర్భంగా చిత్ర టీజర్ ను హైదరాబాద్ లో ఘనంగా రిలీజ్ చేశారు. అనంతరం చిత్రబృందం కేక్ కట్ చేసి  నిర్మాత శ్రీనివాస్ బర్త్ డే సెలబ్రేషన్స్ జరిపారు. ఈ కార్యక్రమంలో యువ హీరోలు కృష్ణ, సంజయ్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా

నటుడు సూర్య మాట్లాడుతూ - "నిశ్శబ్ద" చిత్రంలో ఇంపార్టెంట్ క్యారెక్టర్ చేశాను. ఈ పాత్ర నాకు మంచి పేరు తెస్తుందని ఆశిస్తున్నాను. మా ప్రొడ్యూసర్ శ్రీనివాస్ గారికి బర్త్ డే విశెస్ చెబుతున్నా. ఆయన ఈ చిత్రంతో ఎంతోమంది కొత్తవాళ్లకు అవకాశం కల్పించారు. అన్నారు.

యువ హీరో కృష్ణ మాట్లాడుతూ - "నిశ్శబ్ద" సినిమా టీజర్ చాలా బాగుంది. మీ అందరికీ నచ్చిందని ఆశిస్తున్నా. డైరెక్టర్ రమణమూర్తి మంచి హారర్ థ్రిల్లర్ మూవీని చూపించబోతున్నాడు. ప్రొడ్యూసర్ శ్రీనివాస్ గారు ఇలాగే చాలామంది యంగ్ టాలెంట్ కు అవకాశాలు ఇవ్వాలి. అన్నారు.

యువ హీరో సంజయ్ మాట్లాడుతూ - టీజర్ లాంఛ్ సందర్భంగా "నిశ్శబ్ద" టీమ్ అందిరికీ బెస్ట్ విశెస్ అందిస్తున్నా. సినిమాల్లో చిన్నవి, పెద్దవి అనేది  ఉండదు కంటెంట్ బాగున్న చిత్రాలను ప్రేక్షకులు తప్పకుండా ఆదరిస్తారు. "నిశ్శబ్ద" సినిమాలో కూడా మంచి కంటెంట్ ఉన్నట్లు టీజర్ తో తెలుస్తోంది. ఈ సినిమాను మీరంతా సక్సెస్ చేయాలని కోరుకుంటున్నా. అన్నారు.

హీరో మనోజ్ కుమార్ మాట్లాడుతూ - "నిశ్శబ్ద" మూవీలో హీరోగా నటించే అవకాశం రావడం సంతోషంగా ఉంది. ఈ చిత్రానికి ఆడిషన్ ఇచ్చి సెలెక్ట్ అయ్యాను. మా డైరెక్టర్ రమణమూర్తి గారు ఇచ్చిన సజెషన్స్ వల్లే ఈ మూవీలో బాగా నటించగలిగాను. షూటింగ్ టైమ్ లో ప్రతి విషయంలో జాగ్రత్తలు తీసుకున్నారు. మాది చిన్న సినిమా కాదు. మంచి స్ట్రాంగ్ కంటెంట్ ఉన్న సినిమా. హారర్ ఎలిమెంట్స్ ఆకట్టుకుంటాయి. ఎక్కడా అసభ్యత ఉండదు. క్లీన్ హారర్ మూవీగా మిమ్మల్ని ఆకట్టుకుంటుంది. అన్నారు.

హీరోయిన్ ఆశిత రెడ్డి మాట్లాడుతూ - "నిశ్శబ్ద" చిత్రంతో నేను హీరోయిన్ గా మీ ముందుకు వస్తున్నాను. ఈ సినిమాలో నాకు ఎక్కువగా డైలాగ్స్ ఉండవు. పర్ ఫార్మెన్స్ తోనే ఆకట్టుకునే ప్రయత్నం చేశా. నాతో పాటు నటించిన ప్రతి ఆర్టిస్ట్, టెక్నీషియన్ చాలా సపోర్ట్ చేశారు. ఈ అవకాశం ఇచ్చిన డైరెక్టర్ రమణమూర్తి గారికి, ప్రొడ్యూసర్స్ శ్రీనివాస్, సంధ్యారాణి గారికి థ్యాంక్స్ చెబుతున్నా. అన్నారు.

నిర్మాత శ్రీనివాస్ మాట్లాడుతూ - ఈ రోజు నాకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసిన ప్రతి ఒక్కరికీ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెబుతున్నా. "నిశ్శబ్ద" టీజర్ మీ అందరికీ నచ్చిందని ఆశిస్తున్నా. సినిమా కూడా అంతే బాగుంటుంది. త్వరలోనే మా మూవీని థియేటర్స్ లోకి తీసుకొస్తాం. ఇంకా నాలుగైదు ఇంట్రెస్టింగ్ మూవీస్ మా ప్రొడక్షన్ నుంచి రాబోతున్నాయి. ప్రస్తుతం ఆ చిత్రాలు వివిధ దశల్లో నిర్మాణంలో ఉన్నాయి. వీలైనంతమంది కొత్త వాళ్లకు అవకాశాలు ఇచ్చి కంటెంట్ ఉన్న మంచి చిత్రాలు నిర్మించాలని ప్లాన్ చేస్తున్నాం. అన్నారు.

నిర్మాత ఎం. సంధ్యారాణి మాట్లాడుతూ - మా "నిశ్శబ్ద" సినిమా టీజర్ లాంఛ్ కు వచ్చిన ప్రతి ఒక్కరికీ థ్యాంక్స్. ఒక డిఫరెంట్ హారర్ థ్రిల్లర్ మూవీగా మా సినిమా మిమ్మల్ని ఆకట్టుకుంటుంది. త్వరలోనే గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు ప్లాన్ చేస్తున్నాం. మా సంస్థ నుంచి మరిన్ని మంచి చిత్రాలు రాబోతున్నాయి. అన్నారు.

డైరెక్టర్ రమణమూర్తి తంగెళ్లపల్లి మాట్లాడుతూ - నేను గతంలో ప్రేమ తరంగాలు అనే ఓ లవ్ స్టోరీ మూవీ రూపొందించాను. ఇప్పుడు "నిశ్శబ్ద" అనే హారర్ థ్రిల్లర్ తెరకెక్కిస్తున్నాను. ఈ సినిమా చేసే క్రమంలో ప్రొడ్యూసర్ శ్రీనివాస్ గారు ఎంతో సపోర్ట్ అందించారు. మొత్తం రాత్రుళ్లు షూటింగ్ చేశాం. సాయంత్రం 6 గంటల నుంచి ఉదయం 5 వరకు షూటింగ్ చేసేవాళ్లం. మా కాస్ట్ అండ్ క్రూ షూటింగ్ కు ఎంతో సపోర్ట్ చేశారు. మీ అందరి ఆదరణతో "నిశ్శబ్ద" సినిమా త్వరలోనే థియేటర్స్ లోకి వచ్చి మంచి విజయాన్ని సాధిస్తుందని ఆశిస్తున్నా. అన్నారు.

నటి నాగలక్ష్మి మాట్లాడుతూ - నేను "నిశ్శబ్ద" చిత్రంలో దెయ్యం పాత్రలో కనిపిస్తాను. నాకు నలుగురు సిస్టర్స్, వాళ్లు కూడా దెయ్యం క్యారెక్టర్స్ చేశారు. మాలాంటి యంగ్ టాలెంట్ కు అవకాశం ఇచ్చి ఎంకరేజ్ చేస్తున్న మా ప్రొడ్యూసర్స్, డైరెక్టర్ గారికి థ్యాంక్స్. అన్నారు.

నటీనటులు: మనోజ్ కుమార్, ఆశిత రెడ్డి, భాగ్య, హరిత, నాగ లక్ష్మి, టబు, షైని మహేశ్వరీ, తమన్నా,  హనుమాన్ గారు, ఫాతిమా, రామ్ రెడ్డి, రాజు, మహేందర్ రెడ్డి, విజయ్ వరంగల్, చంటి, చిత్ర, షన్ను, చిత్ర, సై సూర్య, నయనిక, నితిన్, రమీజ షేక్, తదితరులు...

టెక్నీషియన్స్

నిర్మాత: ఎం. సంధ్యా రాణి, ఎం. శ్రీనివాస్
కథ కథనం దర్శకత్వం : రమణ మూర్తి తంగెళ్లపల్లి
డీవోపీ: నందన్ కృష్ణ
సంగీతం : అభిషేక్ రూఫుస్
ఆర్ట్ డైరెక్టర్: సురేష్ ( చంటి )
దర్శకత్వం విభాగం: కిరణ్ కుమార్, ప్రతాప్, సుమలత, సింహా
మేనేజర్: వెంకటేశ్వర్లు
మెకప్: రమేష్
స్టిల్ ఫోటోగ్రాఫర్: చందు
ఆన్‌లైన్ ఎడిటర్: త్రివిక్రమ్
పీఆర్ఓ - ఆర్ కే చౌదరి
ప్రత్యేక కృతజ్ఞతలు : శ్రీనివాస్ .యమ్, నరేంద్ర, దశరథ్, సాయికుమార్, తదితరులు

ఘనంగా సినిమా స్క్రిప్ట్ పూజా కార్యక్రమం
కళాత్రుష్ణ ఫిలిం ఇన్స్టిట్యూట్ సమర్పణలో ప్రేమ్ n ప్రేమ్ ప్రొడక్షన్ బ్యానర్ లో నిర్మించబోతున్న నూతన చిత్ర పూజ కార్యక్రమం శ్రీ. పోచమ్మ తల్లి ఆలయం లో ఘనంగా జరిగింది. ప్రేమ్ కమల్ దర్శకత్వంలో యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ చిత్ర పూజ కార్యక్రమానికి ప్రముఖ నటుడు  తనికెళ్ళ భరణీ  ముఖ్య అతిథిగా విచ్చేసి చిత్ర బృందానికి ఆశీసులు అందచేశారు. పవన్, ప్రేమ్ రంజన్, సుప్రియ, చిత్తరంజన్ ముఖ్య పాత్రలో తెరకెక్కుతున్న ఈ చిత్రం ఘన విజయం సాధించాలని, చిత్ర బృందానికి మరెన్ని మంచి అవకాశాలు రావాలని ఆ భగవంతుణ్ణి కోరుకుంటున్నట్టు తనికెళ్ళ భరణి తెలిపారు. ఈ నెల 17వ తేదీ నుండి మొదటి షెడ్యూల్ ప్రారంభిస్తున్నట్టు చిత్ర బృందం మీడియా కు తెలిపింది. త్వరలోనే చిత్ర టైటిల్ ను ఓ ఈవెంట్ లో ఆవిష్కరించబోతున్నట్లు తెలిపారు. ఈ చిత్రం లో పవన్, ప్రేమ్ రంజన్, సుప్రియ, చిత్తరంజన్, అలేఖ్య, రవి తేజ, వెంకట్, పురుషోత్తం, సత్యనారాయణ, బ్రహ్మానందం, సంజీవ్ కర్నాటి, జశ్వంత్, రవీంద్ర రెడ్డి, కవిత, హర్షిత, రాగ ముఖ్య పాత్రలో నటిస్తున్నారు. ఈ చిత్రానికి కెమెరా : తేజ, ఎడిటర్ : ప్రేమ్ రంజన్, కో డైరెక్టర్: యోగి, అసోసియేట్ డైరెక్టర్: కిరణ్, అసిస్టెంట్ డైరెక్టర్: జయరాజ్, రాకేష్, ఆన్లైన్ ఎడిటర్స్: JP, ఫణీంద్ర,లైన్ ప్రొడ్యూసర్: కమలరంజన్ రచనా దర్శకత్వం : ప్రేమ్ కమల్. తదితరులు పాల్గొన్నారు.

మేము మాటలు కాదు.. అభివృద్ధి చేస్తాం.. ప్రజల శ్రేయస్సే మా లక్ష్యం – అభివృద్ధి మా బాధ్యత
మన్సూరాబాద్ డివిజన్ హయత్ నగర్ ప్రాంతంలో ఎన్నో రోజులుగా కొనసాగుతున్న UGD ట్రంక్ లైన్ పనులను ఈరోజు వివిధ కాలనీ సంక్షేమ సంఘం సభ్యులు తో కలిసి అంజలి రెసిడెన్సీ లో కొనసాగుతున్న పనులను GHMC డిప్యూటీ ఫ్లోర్ లీడర్,స్థానిక  కార్పొరేటర్ కొప్పుల నర్సింహ్మా రెడ్డి గారు  పర్యవేక్షించారు.ఈ సందర్భంగా కార్పొరేటర్ గారు మాట్లాడుతూ ప్రస్తుతం అంజలి రెసిడెన్సి లో నుండి వెళ్తున్న ట్రంక్ లైన్ పనులకు ఎలాంటి అడ్డంకులు కలిగించకుండా ముందుకు కొనసాగించాలని, కొనసాగుతున్న పనులలో సరైన లెవెల్స్ పాటిస్తూ పైప్లైన్ వేస్తున్నారని ఎక్కడైనా సమస్య వస్తే ప్రతినిత్యం స్వయంగా తానే పర్యవేక్షణలో ఉంటారని తెలియజేశారు.పక్కన వెంచర్ కు సంబంధించిన డెవలపర్స్ వారితో మీ అందరి ముందే మాట్లాడడం జరిగిందని ఇంకా మిగతా లైన్లోకి సంబంధించిన పైపులైను తప్పకుండా వెంచర్ల నుండి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తానని అన్నారు.. ప్రభుత్వ స్థలాన్ని ఎవరు ఆక్రమించేందుకు ప్రయత్నించిన ఉపేక్షించేది లేదని హైడ్రా మరియు సంబంధిత ఇరిగేషన్ శాఖ అధికారులకు కూడా ఫిర్యాదు చేయడం జరిగిందని మళ్లీ ఫిర్యాదు చేసి ప్రభుత్వ స్థలాలను అన్యక్రాంతం కాకుండా కాపాడుతామని అన్నారు.ఈ కార్యక్రమంలో కాలనీ అధ్యక్షులు సోమనాథ్,N.రవీందర్ రెడ్డి,సుధాకర్ గౌడ్,మురళి, అమరేందర్ రెడ్డి,శంకర్ రెడ్డి, రామ్ మోహన్ రావు,శ్రీహరి, కృష్ణ మోహన్, గోవర్ధన్ చారి,ఓంకార్ చారి,రామారావు మరియు బిజెపి నాయకులు,కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

కియా ఇండియాలో కొత్తగా "కారెన్స్ క్లావిస్" ఆవిష్కరణ
న్యూఢిల్లీ, మే 8: ప్రీమియం కార్ల తయారీ సంస్థ కియా ఇండియా తాజాగా తన కారెన్స్ పోర్ట్‌ఫోలియోలోకి “కారెన్స్ క్లావిస్” అనే కొత్త తరం రిక్రియేషనల్ వెహికల్‌ను (RV) విడుదల చేసింది. ఇది MPV మరియు SUVల మధ్యలో ప్రత్యేక స్థానాన్ని ఏర్పరుచుకుంటూ, పెద్ద, ఆధునిక కుటుంబాల అవసరాలకు తగ్గట్లు రూపొందించబడింది.“క్లావిస్” అనే పేరు లాటిన్ పదబంధమైన Clavis Aurea నుంచి వచ్చింది. దీని అర్థం “గోల్డెన్ కీ”. కుటుంబ సాహసాలను సూచించే ఈ వాహనం, స్పేస్, డిజైన్, సాంకేతికత, భద్రత వంటి అంశాలలో విలక్షణతను కలిగి ఉంది. వినూత్నతను ప్రతిబింబించే ఈ వాహనం 6 మరియు 7 సీట్ల ఆప్షన్లలో లభించనుంది.ఈ వాహనంలో సెక్టార్‌లోనే ఉత్తమమైన 67.62 సెం.మీ డ్యూయల్ పనోరమిక్ డిస్‌ప్లే, 64 రంగుల అంబియంట్ లైటింగ్, బోస్ ప్రీమియం 8 స్పీకర్ సౌండ్ సిస్టమ్ వంటి అత్యాధునిక ఫీచర్లు ఉన్నాయి. భద్రత పరంగా 20 అడ్వాన్స్డ్ ADAS ఫీచర్లు, 6 ఎయిర్‌బ్యాగ్‌లు, 360 డిగ్రీ కెమెరా, బ్లైండ్ వ్యూ మానిటర్ వంటి అంశాలు ఇందులో ఉన్నాయి.

కారెన్స్ క్లావిస్ మూడు పవర్‌ట్రెయిన్ ఎంపికలలో లభించనుంది – స్మార్ట్‌స్ట్రీమ్ G1.5 పెట్రోల్, G1.5 టర్బో-జీడీఐ పెట్రోల్, D1.5 డీజిల్. వీటిలో టర్బో ఇంజిన్‌కు కొత్త 6-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్ ఎంపికగా ఉంది.ఈ వాహనాన్ని కస్టమర్లు కియా దేశవ్యాప్తంగా ఉన్న డీలర్‌షిప్‌లలో చూసేందుకు, అలాగే ఈరోజు అర్థరాత్రి నుంచి www.kiaindia.com/in వెబ్‌సైట్‌లో బుక్ చేసుకునేందుకు అవకాశం ఉంది.

కియా ఇండియా ఎండీ, సీఈఓ గ్వాంగ్ ఉ లీ వ్యాఖ్య:
“కారెన్స్ క్లావిస్ మా ప్రయాణంలో ఒక కీలక మైలురాయి. వినూత్న డిజైన్, సాంకేతికతతో భారతీయ కుటుంబాల అభిలాషలకు తగ్గ వాహనాన్ని తీసుకువస్తున్నాం” అని తెలిపారు.ఈ కొత్త క్లావిస్ వాహనం కియాకు భారత్‌లోని ఫ్యామిలీ కార్ల విభాగంలో మరింత బలాన్ని చేకూర్చనుంది.

హంద్రీనీవా సుజల స్రవంతి’ పూర్తికి సీఎం చంద్రబాబు సంకల్పం
ఫేజ్ - 1, 2 కింద 554 కి.మీ మేర కాలువ పనులకు రూ.3,873 కోట్లు కేటాయింపు

కాలువ వెడల్పుతో 3,850 క్యూసెక్కులకు పెరగనున్న నీటి సామర్థ్యం

5 నెలల కాలంలో లక్ష్యం మేర పనులు..వచ్చే నెలకల్లా మొదటి దశ పనులు పూర్తి చేయాలని లక్ష్యం

గత టీడీపీ హాయంలో హంద్రీనీవా ప్రాజెక్టు పై రూ.4 వేల కోట్లు పైగా ఖర్చు...కూటమి ప్రభుత్వంలో మళ్లీ శరవేగంగా పనులు

అనంతపురం జిల్లా ఉరవకొండ నియోజకవర్గం, చాయాపురంలో రేపు ప్రాజెక్టు పనుల పరిశీలించనున్న సీఎం చంద్రబాబు

అమరావతి, మే 8 :- రాయలసీమ జీవనాడి హంద్రీనీవా సుజల స్రవంతి నిర్మాణం పనులు వేగవంతం చేసి... త్వరితగతిన ప్రాజెక్టును పూర్తి చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పట్టుదలగా ఉన్నారు. ఇందులో భాగంగా ప్రాజెక్టు నిర్మాణం పనులను స్వయంగా పర్యవేక్షించేందుకు ముఖ్యమంత్రి శుక్రవారం అనంతపురం జిల్లా, ఉరవకొండ నియోజకవర్గంలో పర్యటించనున్నారు. అక్కడ  పనులను పరిశీలించి... అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటారు.
2014లో టీడీపీ ప్రభుత్వ హయాంలో వేగంగా పనులు చేపట్టినా... 2019 తర్వాత వచ్చిన ప్రభుత్వం ప్రాజెక్టుపై తీవ్ర నిర్లక్ష్యం చూపించింది. గత ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టును నాశనం చేసినట్టుగానే HNSSను కూడా పక్కన పెట్టేసింది. కాలువ విస్తరణ, లైనింగ్‌కు సంబంధించి ఎలాంటి పనులు చేయలేదు. రాయలసీమ ప్రాంతానికి ఈ ప్రాజెక్టు ఎంత ప్రయోజనమో తెలిసి కూడా పట్టించుకోలేదు. 2024లో HNSSకు పట్టిన గ్రహణం తొలిగిపోయింది. కూటమి విజయంతో ఈ ప్రాజెక్టు పనులు మళ్లీ వేగం పుంజుకున్నాయి. దశాబ్దాల ఆకాంక్ష త్వరలోనే సాకారం కానుంది. కూటమి ప్రభుత్వం రాగానే HNSS మెయిన్ కాలువ, పుంగనూరు బ్రాంచ్ కాలువ లైనింగ్ - వెడల్పు పనులకు ముఖ్యమంత్రి పరిపాలనా అనుమతులిచ్చి పట్టాలెక్కించారు. 2025 జూన్ నాటికి ఫేజ్-I పూర్తయ్యేలా ముఖ్యమంత్రి అధికారులకు ఇప్పటికే లక్ష్యాన్ని నిర్దేశించారు. దీనిలో భాగంగా కొద్దినెలలుగా పనులు అత్యంత వేగంగా జరుగుతున్నాయి.

2014 – 2019 మధ్య కాలంలో :

2014 నుంచి 2019 వరకు ఐదేళ్ల పాటు హంద్రీనీవా ప్రాజెక్టు పనులు శరవేగంగా జరిగాయి. ప్రాజెక్టు సామర్ధ్యానికి తగ్గట్టు కాలువలు లేకపోవడంతో డిజైన్‌లో మార్పు చేసి HNSS మెయిన్ కాలువను వెడల్పు చేయాలని అప్పట్లో ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రతిపాదించారు. కాలువను వెడల్పు చేసే పనులు ఏప్రిల్ 2017లో చేపట్టారు. గొల్లపల్లి రిజర్వాయర్, మడకశిర బ్రాంచ్ కాలువ పనులు 2016-17లో పూర్తయ్యాయి. కియా పరిశ్రమలకు నాడు గొల్లపల్లి రిజర్వాయర్ నుంచే నీరివ్వడం జరిగింది. చెర్లోపల్లి, మారాల రిజర్వాయర్లు 2018-19లో పూర్తయ్యాయి. 2019లో మొదటిసారిగా MBC, PBCకి నీరు విడుదల చేశారు.

ఈ 5 నెలల్లో పనుల్లో పురోగతి :

HNSS మెయిన్ కాలువ, పుంగనూరు బ్రాంచ్ కాలువ లైనింగ్ పనులకు పరిపాలనా అనుమతులను కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే మంజూరు చేసింది. మొదట కాలువలకు లైనింగ్ లేకుండా నిర్మించడంతో గరిష్ట ప్రవాహం కేవలం 2,200 క్యూసెక్కులు మాత్రమే ఉండేది. 3850 క్యూసెక్కుల సామర్థ్యం కలిగేలా... కాలువలను విస్తరించి, లైనింగ్ పనులు చేపట్టారు. 5 నెలల కాలంలో లక్ష్యం మేర పనులు జరిగాయి. వచ్చే నెలకల్లా మొదటి దశ పనులు పూర్తి చేయాలని లక్ష్యం గా పెట్టుకున్నారు. ఫేజ్-II కాలువల (పుంగనూరు,కుప్పం బ్రాంచ్‌లు) పనులు వేగంగా జరుగుతున్నాయి. పాడెర, మడకశిర, కుప్పం వంటి ప్రాంతాలకు నీరు చేరేలా ముఖ్యమంత్రి చర్యలు తీసుకున్నారు.

మొత్తం రూ.3,873 కోట్లతో పనులు :

హంద్రీనీవా ప్రాజెక్టులో ఫేజ్ - 1, 2 కింద 554 కి.మీ. మేర కాలువ లైనింగ్, వెడల్పు పనులకు మొత్తం రూ.3,873 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేస్తోంది. ఫేజ్-1 కింద రూ.696 కోట్లతోనూ, ఫేజ్-2 కింద రూ.1,256 కోట్లతో HNSS ప్రధాన కాలువ (Km 216 – Km 400), పుంగనూరు బ్రాంచ్ కాలువ (Km 0.00 – Km 75) పనులు చేపట్టారు. పుంగనూరు బ్రాంచ్ కాలువ (Km 75 – Km 207) పనులను రూ.480 కోట్లతో ఈ ఏడాది జనవరిలో ప్రారంభించారు. ఇప్పటివరకు 15 కిలోమీటర్ల మేర పనులు పూర్తయ్యాయి. రూ.197 కోట్లతో కుప్పం బ్రాంచ్ కాలువ పనులు ఈ ఏడాది ఫిబ్రవరిలో ప్రారంభించగా, ఇప్పటివరకు 40 కిలోమీటర్ల మేర పనులు పూర్తయ్యాయి. ఫేజ్ 2 పూర్తయితే మెయిన్ కెనాల్ నుంచి 2,520 క్యూసెక్కులు, PBC నుంచి 840 క్యూసెక్కులు నీటి సరఫరాకు వీలవుతుంది. HNSS మెయిన్ కాలువకు సంబంధించి రూ.590 కోట్లతో 400 కి.మీ నుంచి 490 కి.మీ వరకు లైనింగ్ పనులకు, అలాగే రూ.291 కోట్లతో 490 కి.మీ నుంచి 554 కి.మీ వరకు లైనింగ్ పనులకు, నీవా కాలువకు సంబంధించి రూ.362 కోట్లతో 0 కి.మీ నుంచి 123 కి.మీ వరకు పనులు చేపట్టాలని ప్రతిపాదనలు సిద్ధం చేశారు.

HNSS ప్రాజెక్టు లక్ష్యం :

ప్రాజెక్టు పూర్తయితే Phase-I కింద కర్నూలు జిల్లాలో 77,094, నంద్యాల జిల్లాలో 2,906, అనంతపురం జిల్లాలో 1,18,000 ఎకరాలు... మొత్తం 1,98,000 ఎకరాలకు సాగునీరు అందుతుంది. Phase-II కింద అనంతపురం జిల్లాలో 33,617, సత్యసాయి జిల్లాలో 1,93,383, కడప జిల్లాలో 37,500, చిత్తూరు జిల్లాలో 1,40,000 ఎకరాలు కలిపి మొత్తం 4,04,500 ఎకరాలకు సాగునీరు అందుతుంది. ఉమ్మడి కర్నూలు, అనంతపురం, కడప, చిత్తూరు జిల్లాల్లో 6,02,500 ఎకరాలకు సాగునీరు లభిస్తుంది. మొత్తం 81 మండలాల్లో 33 లక్షల మందికి త్రాగు నీటి సరఫరాకు అవకాశం లభిస్తుంది. ఈ ప్రాజెక్టు పనుల రేపు స్వయంగా పరిశీలించి ముఖ్యమంత్రి అధికారులకు దిశా నిర్ధేశం చేయనున్నారు.

లైసెన్సుడ్ సర్వేయర్ల శిక్షణకు దరఖాస్తులు
• లైసెన్సుడ్ సర్వేయర్ల శిక్షణకు దరఖాస్తులు
• 5వ తేదీ నుంచి 17వరకు మీ సేవా కేంద్రాల్లో స్వీకరణ
• ఇంటర్ లో గణితం నుంచి బీటెక్ సివిల్ వరకు అర్హత
రంగారెడ్డి జిల్లా : భూమికి సంబంధించిన సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భూ భారతి (భూ హక్కుల రికార్డు) చట్టం-2025 ను ఏప్రిల్ 14న  డాక్టర్ బి. ఆర్. అంబేద్కర్ జయంతి నాడు ప్రారంభించడం జరిగిందని
తెలిపారు. రెవెన్యూ పరిపాలనకు, సర్వే మరియు ల్యాండ్ రికార్డ్స్ విభాగం సహాయంగా,రాష్ట్రంలోని దాదాపు 5000 మంది లైసెన్స్ పొందిన సర్వేయర్లకు శిక్షణఇవ్వాలని యోచిస్తోందని, లైసెన్సుడు సర్వేయర్ల శిక్షణ కోసం అర్హత గల అభ్యర్థుల నుంచి తెలంగాణ అకాడమీ ఆఫ్ ల్యాండ్ ఇన్ఫర్మేషన్ అండ్ మేనేజ్మెంట్ (తాలిమ్) దరఖాస్తులను ఆహ్వానించిందని,  ఈ నెల 5వ తేదీ నుంచి
రాష్ట్రంలోని అన్ని మీసేవా కేంద్రాల్లో రూ.100 చెల్లించి దరఖాస్తు,
ప్రాస్పెక్టస్ పొందవచ్చని, మీసేవా కేంద్రాల్లోనే ఈనెల 17వ తేదీ వరకు
దరఖాస్తులు సమర్పించాలని జిల్లా కలెక్టర్ సి.నారాయణ రెడ్డి గురువారం ఒక ప్రకటనలో తెలియజేశారు. ఇంటర్ లో గణితంతో 60% మార్కులు సాధించిన వారు,ఐటీఐ డ్రాఫ్ట్స్ మెన్ (సివిల్) డిప్లొమా (సివిల్), బీటెక్ (సివిల్) లేదా సమానమైన అర్హత గల వారు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. ఎంపికైన అభ్యర్థులకు జిల్లా ప్రధాన కేంద్రాలలో  తేదీ:26-05-2025 నుండి 26-07-2025 వరకు 50 పని దినాల్లో శిక్షణ ఇవ్వబడుతుందని, ఇందుకు ఓసీ అభ్యర్థులు రూ.10 వేలు, బీసీ అభ్యర్థులు రూ.5 వేలు, ఎస్సీ,ఎస్టీ అభ్య ర్థులు రూ.2,500 ఫీజు చెల్లించాల్సి ఉంటుందని వివరించారు.