రాజేంద్రనగర్ - Nagaranijam

శంషాబాద్ లో గులాబీ నేతల అరెస్టు
అరెస్టు చేసిన నేతలను పహాడీ షరీఫ్ పోలీస్ స్టేషన్ కు తరలింపు

మంత్రి పొంగులేటికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేస్తే గులాబీ నేతలు

రాజేంద్రనగర్, మార్చి 30(నగరనిజం ప్రతినిధి):మాజీ మంత్రి, బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పర్యటన నేపథ్యంలో శంషాబాద్ కు చెందిన పలువురు పార్టీ రాష్ట్ర, జిల్లా స్థాయి నేతలను పోలీసులు అరెస్టు చేశారు. కేటీఆర్ సారధ్యంలో బీఆర్ఎస్ నేతల బృందం సోమవారం నాడు శంషాబాద్ పరిధిలోని కొత్వాల్ గూడ వద్ద రాఘవ కన్స్ట్రక్షన్స్ క్రషర్ మిషన్ ప్లాంట్ ను సందర్శించనున్నారని సమాచారం రావడంతో ఆ పార్టీ నేతల బృందం హుటాహుటిన రాఘవ క్రషర్ ప్లాంట్ కు చేరుకుంది. దీంతో అప్రమత్తమైన శంషాబాద్ ఆర్.జి.ఐ.ఏ పోలీసులు..... ఎక్కడికక్కడ బీఆర్ఎస్ పార్టీ నేతలను అరెస్టు చేశారు. బీఆర్ఎస్పార్టీ రాష్ట్ర నేత మంచర్ల శ్రీనివాస్,బీఆర్ఎస్ పార్టీ శంషాబాద్ డివిజన్ అధ్యక్షుడు కొలను రెడ్డి, చెక్కల ఎల్లయ్య ముదిరాజ్ (శంషాబాద్ మాజీ ఎంపీపీ), పార్టీ సీనియర్ నేతలు దేవరంపల్లి బుచ్చిరెడ్డి, మాజీ జెడ్పిటిసి బూరు కుంట సతీష్, కొనమొల్ల శ్రీనివాస్, రఘు యాదవ్, చిన్న గండు రాజేందర్, వెంకట్ రెడ్డి, చెక్కల చంద్రశేఖర్ ముదిరాజ్ (పెద్ద షాపూర్ మాజీ సర్పంచ్), వీరమల్లు హనుమంతు ముదిరాజ్, కొమ్ము గోపాల్, మహమ్మద్ గౌస్ పాషా, మంచర్ల చిరంజీవి, బాత్కు మహేష్ యాదవ్, షేక్ మహమూద్, బక్క శ్రీకాంత్ తదితర నేతలు ,కార్యకర్తలు కేటీఆర్ రాకను పురస్కరించుకొని రాఘవ కన్స్ట్రక్షన్స్ క్రషర్ మిషన్ ప్లాంట్ వద్దకు చేరుకున్నారు. దీంతో శంషాబాద్ జోన్ డీసీపీ రాజేష్, ఏసీపీ శ్రీకాంత్ గౌడ్ సారధ్యంలో అప్రమత్తమైన శంషాబాద్ ఆర్జీఐఏ పోలీసులు.... గులాబీ పార్టీ నేతలను అరెస్టు చేసి పహాడీ షరీఫ్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వంతో పాటు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి వ్యతిరేకంగా బీఆర్ఎస్ నేతలు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. రాఘవ కన్స్ట్రక్షన్స్ పేరుతో కొనసాగుతున్న అక్రమ మైనింగ్ వ్యాపారాన్ని తక్షణమే నిలిపివేయాలని వారు డిమాండ్ చేశారు. ప్రజల ఆస్తులను దోచుకుంటూ పర్యావరణానికి పెనుముప్పు కలిగిస్తున్న రాఘవ కన్స్ట్రక్షన్స్ వంటి అక్రమ మైనింగ్ వ్యాపారులను సహించే ప్రసక్తే లేదని, బీఆర్ఎస్ పార్టీ ప్రజల పక్షాన నిలిచి పోరాటం కొనసాగిస్తుందని ఈ సందర్భంగా ఆ పార్టీ రాష్ట్ర నేత మంచర్ల శ్రీనివాస్, పార్టీ శంషాబాద్ డివిజన్ అధ్యక్షుడు కొలను ప్రదీప్ రెడ్డి ప్రకటించారు.

మైలార్ దేవ్ పల్లి లో బెడిసి కొట్టిన మర్డర్ వ్యూహం
బాధితుడి ఫిర్యాదుతో మర్డర్ వ్యూహాన్ని భగ్నం చేసిన మైలార్ దేవ్ పల్లి పోలీసులు

నిందితులు ఇమ్రాన్ ఖాన్, మహమ్మద్ సైఫ్, శ్రీరామ్ ను అరెస్టు చేసి కటకటాల్లోకి నెట్టిన పోలీసులు

నిందితుల వద్ద నుండి మారణాయుధాలు, రెండు ద్విచక్ర వాహనాలతో పాటు మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్న పోలీసులు

నిందితులకు 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ విధించిన రాజేంద్రనగర్ కోర్టు

నిందితులు చంచల్ గూడ జైలుకు తరలింపు

మీడియాకు వివరాలు వెల్లడించిన మైలార్ దేవుపల్లి ఇన్స్పెక్టర్ నరేందర్

రాజేంద్రనగర్, సెప్టెంబర్ 23
(నగరనిజం ప్రతినిధి):

9 లక్షల సుఫారీ ఇచ్చి ఓ వ్యక్తిని హత్య చేయడానికి పథకం రచించిన ప్రత్యర్థి వర్గం ఎత్తులను మైలార్ దేవ్ పల్లి పోలీసులు చిత్తు చేశారు. మర్డర్ స్కెచ్ ను భగ్నం చేసిన పోలీసులు..... ముగ్గురు నిందితులను అరెస్టు చేసి వారిని శ్రీకృష్ణ జన్మస్థానానికి తరలించారు. పట్టుబడ్డ నిందితుల నుండి మారణాయుధాలతో పాటు ద్విచక్ర వాహనాలు, మొబైల్ ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మరోవైపు మర్డర్ కేసు వ్యూహాన్ని భగ్నం చేసి నిందితుల ఆట కట్టించిన మైలార్ దేవుపల్లి పోలీసులను సైబరాబాద్ కమీషనర్ అవినాష్ మహంతి తో పాటు రాజేంద్రనగర్ జోన్ డీసీపీ చింతమనేని శ్రీనివాస్ అభినందించారు.ఇందుకు సంబంధించిన వివరాలను మంగళవారం సాయంత్రం మీడియాకు వివరించారు మైలార్ దేవ్ పల్లి ఇన్స్పెక్టర్ నరేందర్. సీఐ నరేందర్ కథనం ప్రకారం ఈ ఘటనకు సంబంధించిన వివరాలు.....పూర్వాపరాలు ఇలా ఉన్నాయి. రాజేంద్రనగర్ నియోజకవర్గం మైలార్ దేవ్ పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని వట్టేపల్లిలో నివాసముండే ఇమ్రాన్ ఖాన్ గత కొంతకాలంగా సెకండ్ హ్యాండ్ ద్విచక్ర వాహనాల కొలుగోలు, అమ్మకాల వ్యాపారం సాగిస్తున్నాడు. ఈ నేపథ్యంలో వ్యాపార లావాదేవీలకు సంబంధించి ఇమ్రాన్ ఖాన్ తో అతని ప్రత్యర్థి వర్గీయుడికి మధ్యన గత కొన్ని రోజులుగా విభేదాలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో ఏడాది క్రితం రియల్ ఎస్టేట్ వ్యాపారానికి సంబంధించి 50వేల డబ్బులు చెల్లించే విషయంలో గొడవలు తలెత్తడంతో కొందరు వ్యక్తులు ఇమ్రాన్ ఖాన్ ఇంటిపై దాడికి పాల్పడ్డారు. దీంతో అప్పట్లో మైలార్ దేవ్ పల్లి పోలీసులు దాడికి పాల్పడ్డ నిందితులను అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు. అయితే తన పై దాడి చేయించింది తన ప్రత్యర్థి వర్గీయులేనని నిర్ధారించుకున్న ఇమ్రాన్ ఖాన్.... ఎలాగైనా సరే వారిని అంతమొందించాలని నిర్ణయించుకున్నాడు. ఈ మేరకు బార్కాస్ లో నివాసముండే ఇబ్రహీం అనే వ్యక్తిని సంప్రదించి ప్రత్యర్థిని అంతమొందించడానికి సుఫారి గ్యాంగ్ తో డీల్ కుదుర్చుకున్నాడు ఇమ్రాన్ ఖాన్. ఇందుకోసం బార్కాస్ లోని ఓ స్మశాన వాటిక వద్ద సుపారి గ్యాంగుతో సమావేశమైన ఇమ్రాన్ ఖాన్.... ప్రత్యర్థిని హత్య చేస్తే 9 లక్షలు చెల్లించడానికి ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఇంకేముంది డీల్ కుదరడంతో మహమ్మద్ సైఫ్ శ్రీరామ్ అనే మరో వ్యక్తితో కలిసి ఇమ్రాన్ ఖాన్ ప్రత్యర్థిని హత్య చేయడానికి పథకం రచించాడు.ఈ మేరకు సుఫారీ గ్యాంగుకు 60,000 అడ్వాన్స్ చెల్లించాడు. అడ్వాన్స్ చేతికందడంతో రంగంలోకి దిగిన సుపారి గ్యాంగ్....ఇందుకోసం పక్క ప్రణాళిక రచించింది. ఈ మేరకు సుఫారీ గ్యాంగ్
సోమవారం రాత్రి  మైలార్ దేవుపల్లి డివిజన్ పరిధిలోని వట్టేపల్లి నైస్ హోటల్ వద్ద మాటు వేసి ఉంది. అయితే ఇమ్రాన్ ఖాన్ సుఫారి గ్యాంగ్ చేత తనను హత్య చేయడానికి పథకం రచించాడని అతని ప్రత్యర్థి పోలీసులకు ఉప్పందించాడు. దీంతో అప్రమత్తమైన మైలార్ దేవుపల్లి ఇన్స్పెక్టర్ నరేందర్..... సోమవారం రాత్రి తన సిబ్బందితో కలిసి హుటా హుటిన వట్టేపల్లి నైస్ హోటల్ వద్దకు చేరుకున్నారు. చాకచక్యంగా వ్యవహరించి సుఫారి గ్యాంగ్ ను అదుపులోకి తీసుకొని విచారించడంతో ఈ వ్యవహారం వెలుగు చూసినట్లు మైలార్ దేవ్ పల్లి ఇన్స్పెక్టర్ నరేందర్ మీడియాకు వెల్లడించారు. ఈ మేరకు పట్టుపడ్డ నిందితులు ఇచ్చిన సమాచారం మేరకు ప్రధాన నిందితుడు ఇమ్రాన్ ఖాన్ తో పాటు మహమ్మద్ సైఫ్, శ్రీరామ్ అనే ముగ్గురు నిందితులను అరెస్టు చేసినట్లు సీఐ నరేందర్ తెలిపారు.నిందితుల వద్ద నుండి రెండు కత్తులు, రెండు ద్విచక్ర వాహనాలతో పాటు 3 మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు ఆయన మీడియాకు వివరించారు. అనంతరం నిందితులను రాజేంద్రనగర్ కోర్టులో హాజరు పర్చగా.... న్యాయస్థానం ముగ్గురు నిందితులకు 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించినట్లు సీఐ నరేందర్ తెలిపారు. అనంతరం నిందితులను చంచల్ గూడ జైలుకు తరలించినట్లు సీఐ నరేందర్ ప్రకటించారు.

హయత్‌నగర్ పోలీస్‌ స్టేషన్ పరిధిలో కుంట్లూర్ లో ఘోర రోడ్డు ప్రమాదం
హయత్‌నగర్ /కుంట్లూర్/ నగర నిజం  : హయత్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కుంట్లూర్ గ్రామంలో మంగళవారం నాడు ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. నారాయణ కాలేజ్ (బాసర క్యాంపస్) సమీపంలో ఉదయం 5.45 గంటల సమయంలో స్కోడా కారు (నంబరు MH-02-DG-0771) , డీసీఎం వాహనం (నంబరు TS-07-UK-2664) ఒకదానికొకటి ఢీకొన్నాయి.పసుమాముల నుంచి కుంట్లూర్ వైపు వస్తున్న స్కోడా కారు, కుంట్లూర్ నుంచి పసుమాముల వైపు వెళ్తున్న డీసీఎం వాహనం మధ్య నారాయణ కాలేజ్ సమీపంలో ఉన్న మలుపు వద్ద వేగంగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ముగ్గురు యువకులు అక్కడికక్కడే మృతిచెందారు. వారు:
పిన్నింటి చంద్రసేన రెడ్డి (24),
చుంచు త్రినాథ్ రెడ్డి (24),
చుంచు వర్షిత్ రెడ్డి (23) — అని గుర్తించారు.
ఇతర వ్యక్తి అలిమేటి పవన్ కల్యాణ్ రెడ్డి (24) గాయపడ్డాడు. గాయపడిన అతన్ని హయత్‌నగర్‌లోని సన్‌రైజ్ హాస్పిటల్‌కు తరలించారు. మృతులు, గాయపడిన వ్యక్తి  నలుగురూ కుంట్లూర్ నివాసితులుగా గుర్తించారు.ఈ ప్రమాదంపై హయత్‌నగర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

తొండుపల్లిలో నేటి నుండి ఫ్రీ లివర్ హెల్త్ క్యాంప్ - పారేపల్లి లావణ్య శ్రీనివాస్ గౌడ్
సోమవారం నుండి శుక్రవారం వరకు ఐదు రోజుల పాటు కొనసాగనున్న క్యాంప్

ఏఐజి ఆసుపత్రి తో పాటు ఇన్స్టిట్యూట్ ఆఫ్ లివర్ సైన్సెస్ ఆధ్వర్యంలో కొనసాగనున్న ఉచిత వైద్య శిబిరం

రాజేంద్రనగర్, మే 19,(నగరనిజం ప్రతినిధి):రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని తొండుపల్లిలో సోమవారం (నేటి) నుండి ఐదు రోజుల పాటు ఉచిత లివర్ హెల్త్ క్యాంప్ నిర్వహించనున్నట్లు స్థానిక మాజీ కౌన్సిలర్ పారేపల్లి లావణ్య శ్రీనివాస్ గౌడ్ ప్రకటించారు. గచ్చిబౌలి ఏఐజి ఆసుపత్రి తో పాటు ఇన్స్టిట్యూట్ ఆఫ్ లివర్ సైన్సెస్ ఆధ్వర్యంలో ఈ ఉచిత మెగా వైద్య శిబిరాన్ని నిర్వహించబోతున్నట్లు లావణ్య శ్రీనివాస్ గౌడ్ వెల్లడించారు. తొండుపల్లి లోని 10,11,12 వార్డుల్లో సోమవారం నుండి శుక్రవారం వరకు ఐదు రోజుల పాటు ఈ ఉచిత వైద్య శిబిరం నిర్వహించడం జరుగుతుందని పారేపల్లి లావణ్య శ్రీనివాస్ గౌడ్ తెలిపారు.10, 11,12 వార్డులకు సంబంధించిన మాజీ కౌన్సిలర్లు పారేపల్లి లావణ్య శ్రీనివాస్ గౌడ్, పెదిరిపాటి రాణి యాదయ్య గౌడ్(పెదిరిపాటి ప్రవీణ్ గౌడ్), కొండా ప్రవీణ్ గౌడ్ ఈ ఉచిత వైద్య శిబిరాన్ని పర్యవేక్షించడం జరుగుతుందని పేర్కొన్నారు. తొండుపల్లి లోని జిల్లా పరిషత్ హై స్కూల్ గ్రౌండ్ లో ఐదు రోజుల పాటు నిర్వహించనున్న ఉచిత లివర్ వైద్య శిబిరాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని పారేపల్లి లావణ్య శ్రీనివాస్ గౌడ్ సూచించారు. 10, 11, 12 వార్డుల పరిధిలోని దాదాపు పదివేల మంది ప్రజానీకానికి ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహించి మందులు పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. అనుభవజ్ఞులైన వైద్య నిపుణుల చేత స్కానింగ్, రక్త పరీక్షలు నిర్వహించడం జరుగుతుందని, తొండుపల్లి ప్రజానీకం ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని లావణ్య శ్రీనివాస్ గౌడ్ పిలుపునిచ్చారు.

శంషాబాద్ లో ట్రైనీ కానిస్టేబుల్ ఘరానా మోసం
నిందితుడు పీటీఓ కానిస్టేబుల్ నిస్సార్ అహ్మద్ ను అరెస్టు చేసిన ఆర్.జి.ఐ.ఏ పోలీసులు

ప్రభుత్వం పోలీసులకు మంజూరు చేసే ఫాస్టాగ్ స్టిక్కర్లను చోరీ చేసి ప్రైవేట్ క్యాబులకు విక్రయిస్తున్న కంత్రీ

నిందితుడి అరెస్ట్, మూడు ప్రైవేట్ క్యాబులు సీస్

రాజేంద్రనగర్, మే 19
(నగరనిజం ప్రతినిధి):

రంగారెడ్డి జిల్లాలోని శంషాబాద్ లో ఓ ట్రైనింగ్ కానిస్టేబుల్ ఘరానా మోసాన్ని పోలీసులు బట్టబయలు చేశారు. ఔటర్ రింగ్ రోడ్డు సిబ్బంది ఇచ్చిన ఫిర్యాదుతో రంగంలోకి దిగిన శంషాబాద్ ఆర్.జి.ఐ.ఏ పోలీసులు నిందితుడు నిస్సార్ అహ్మద్ ను అరెస్టు చేయడంతో పాటు మూడు ప్రైవేటు క్యాబులను సీజ్ చేశారు. శంషాబాద్ ఆర్.జి.ఐ.ఏ ఇన్స్పెక్టర్ బాలరాజు కథనం ప్రకారం పోలీసు కానిస్టేబుల్ ఘరానా మోసానికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. నిందితుడు నిస్సార్  అహ్మద్ (30) అనే యువకుడు గత కొంతకాలంగా శంషాబాద్ ఆర్.జి.ఐ.ఏ పోలీస్ స్టేషన్ లో పీటీఓ అండర్ ట్రైనీ కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున్నాడు. అయితే శిక్షణ కాలంలోనే మనోడు రాటు తేలిపోయాడు. పోలీసు వాహనాల కోసం ప్రభుత్వం మంజూరు చేసే ఫాస్టాగ్ స్టిక్కర్లను చోరీ చేస్తూ వాటిని ప్రైవేట్ క్యాబులకు విక్రయించి సొమ్ము చేసుకోవడం వృత్తిగా ఎంచుకున్నాడు. ఈ క్రమంలో పోలీస్ స్టేషన్ నుండి 10 ఫాస్టాగ్ స్టిక్కర్లను చోరీ చేసిన నిందితుడు నిస్సార్ అహ్మద్.... వాటిని ప్రైవేట్ క్యాబులకు విక్రయించాడు. ఇందుకోసం ఒక్కో వాహనానికి ఒక్కో రేటు నిర్ణయించాడు.విమానాశ్రయానికి రాకపోకలు సాగించే ప్రైవేటు క్యాబులకు నెలకు 8000, ఔటర్ రింగ్ రోడ్డు మీద ప్రయాణించే ప్రైవేట్ క్యాబ్ వాహనాలకు 2000 చొప్పున వసూలు చేస్తున్నాడు. అయితే ఫాస్టాగ్ వ్యవహారంపై అనుమానం రావడంతో ఔటర్ రింగ్ రోడ్డు టోల్ గేట్ మేనేజర్ శంషాబాద్ ఆర్.జి.ఐ.ఏ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఇంకేముంది ఔటర్ రింగ్ రోడ్డు సిబ్బంది ఇచ్చిన ఫిర్యాదుతో రంగంలోకి దిగిన శంషాబాద్ ఆర్.జి.ఐ.ఏ పోలీసులు.... తీగ లాగితే డొంక కదిలిన చందంగా ట్రైనీ కానిస్టేబుల్ ఫాస్టాగ్ స్టిక్కర్ల అవినీతి బాగోతం వెలుగు చూసింది. ఈ మేరకు నిందితుడిని అరెస్టు చేసి మూడు క్యాబులను సీజ్ చేసినట్లు సీఐ బాలరాజు ప్రకటించారు.

పదో తరగతి లో పాసయ్యింది....ప్రేమికుడి చేతిలో ఓడిపోయింది
ప్రేమ పేరుతో మైనర్ బాలికను వంచించిన రవి

ప్రేమ వ్యవహారమే కారణంగా తేల్చిన శంషాబాద్ పోలీసులు

నిందితుడు తెలగమల్ల రవి అరెస్ట్, కేసు నమోదు

శంషాబాద్ (మం) లోని పెద్దతూప్ర లో ఘటన

రాజేంద్రనగర్, మే 18(నగరనిజం ప్రతినిధి): చదువుల బడిలో గెలిచింది... తోటి విద్యార్థులతో పోటీపడుతూ పదో తరగతిలో ఫస్ట్ క్లాస్ లో పాస్ అయ్యింది.... బట్ ప్రేమికుడి చేతిలో వంచనకు గురైన ఆ అభాగ్యురాలు జీవితంపై విరక్తితో ఉరి వేసుకొని బలవన్మరణానికి పాల్పడి తనువు చాలించింది. మరోవైపు బాలిక ఆత్మహత్యకు కారకుడైన ప్రేమికుడిని శంషాబాద్ రూరల్ పోలీసులు అరెస్టు చేసి కేసు నమోదు చేశారు. తీవ్ర విషాదాన్ని నింపిన ఈ ఘటన రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం లోని పెద్దతూప్ర గ్రామంలో చోటుచేసుకుంది. పెద్దతూప్ర గ్రామంలో తీవ్ర విషాదాన్ని నింపిన ఈ ఘటనకు సంబంధించి శంషాబాద్ రూరల్ పోలీసులతో పాటు బాధితుల కథనం ప్రకారం వివరాలు....పూర్వాపరాలు ఇలా ఉన్నాయి. పెద్దతూప్ర గ్రామానికి చెందిన 16 ఏళ్ల మైనర్ బాలిక ఇటీవల పదవ తరగతి పరీక్షల్లో 474 మార్కులతో ఫస్ట్ క్లాస్ లో పాస్ అయింది. అయితే అదే గ్రామానికి చెందిన తెలగమల్ల రవి (25) అనే యువకుడు ప్రేమ పేరుతో గత కొన్ని రోజులుగా బాలిక వెంటపడుతున్నాడు. ఈ క్రమంలో ప్రేమ పేరుతో బాలికను లొంగదీసుకున్న నిందితుడు రవి....ఇటీవల బాలికను తన వెంట తీసుకెళ్లాడు.దీంతో బాలిక కుటుంబ సభ్యులు తమ కూతురు కనిపించడం లేదంటూ శంషాబాద్ రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇంకేముంది బాలిక మైనర్ కావడంతో భయాందోళనకు గురైన రవి..... ఆమెను పెద్దతూప్ర గ్రామంలో వదిలేసి జారుకున్నాడు. ఈ నేపథ్యంలో ప్రేమికుడి చేతిలో ప్రేమ వ్యవహారం తో జీవితంలో ఓడిపోయానని కలత చెందిన బాలిక..... తన ఇంట్లో ఉరి వేసుకొని బలవన్మరణానికి పాల్పడింది. కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు శంషాబాద్ రూరల్ ఇన్స్పెక్టర్ నరేందర్ రెడ్డి ఆధ్వర్యంలో రంగంలోకి దిగిన పోలీసులు....బాలిక మృతదేహాన్ని స్వాధీనం చేసుకొని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. శనివారం నాడు పోస్టుమార్టం అనంతరం బాలిక మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఈ మేరకు నిందితుడు రవిని అదుపులోకి తీసుకొని పోక్సో మరియు కిడ్నాప్ నేరం కింద కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు శంషాబాద్ పోలీసులు ప్రకటించారు.

నకిలీ వీసాలు....ఉద్యోగాల పేరుతో మోసాలు
రాజేంద్రనగర్‌, మే16,(నగరనిజం ప్రతినిధి) : రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌ ప్రాంతాన్ని అడ్డాగా చేసుకొని నకిలీ వీసాలతో మోసాలకు పాల్పడుతున్న ముఠా గుట్టును రట్టు చేశారు శంషాబాద్‌ ఎస్‌ఓటి టీమ్స్‌ మరియు విమానాశ్రయం పోలీసులు. ఈ మేరకు జాయింట్‌ ఆపరేషన్‌ ద్వారా ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు.... వారి వద్ద నుండి పెద్ద మొత్తంలో పాస్‌ పోర్టులు, నకిలీ వీసాల తో పాటు వీసాల తయారీ సామాగ్రిని స్వాధీనం చేసుకున్నట్లు శంషాబాద్‌ ఏసీపీ శ్రీకాంత్‌ గౌడ్‌ ప్రకటించారు. మరోవైపు పరారీలో ఉన్న మరో ముగ్గురు నిందితుల కోసం ప్రత్యేక బృందాలతో గాలిస్తున్నట్లు ఆయన వెల్లడిరచారు. ఈ మేరకు గురువారం నాడు శంషాబాద్‌ లోని తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నకిలీ వీసాల తయారీ ముఠా అరెస్ట్‌ వివరాలను మీడియాకు వెల్లడిరచారు ఏసీపీ శ్రీకాంత్‌ గౌడ్‌. శ్రీకాంత్‌ గౌడ్‌ కథనం ప్రకారం నకిలీ వీసాల తయారీ.... ఉద్యోగాల పేరుతో మోసాలు చేస్తున్న వ్యవహారానికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.నిరక్షరాస్యులైన అమాయకులను లక్ష్యంగా చేసుకొని వారికి నకిలీ వీసాలను అంటగడుతూ గల్ఫ్‌ దేశాలకు పంపి సొమ్ము చేసుకుంటున్న ముఠా గుట్టును రట్టు చేశారు శంషాబాద్‌ విమానాశ్రయం పోలీసులు. నకిలీ వీసాలతో గల్ఫ్‌ కు వెళ్లేందుకు ప్రయత్నించిన 8 మంది ప్రయాణికులను ఇమ్మిగ్రేషన్‌ అధికారులు అదుపులోకి తీసుకొని విచారించడంతో  ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఆంధ్రప్రదేశ్‌ లోని వెస్ట్‌ గోదావరి జిల్లా లోని రామన్నపాలెం గ్రామానికి చెందిన సత్యనారాయణ, రాఘవేంద్ర నగర్‌ పెనుగొండ గ్రామానికి చెందిన చిలుకూరి బాలాజీ(43), హైదరాబాద్‌ లోని ఆసిఫ్‌ నగర్‌ ప్రాంతానికి చెందిన పెనెగలపాటి అంజి అలియాస్‌ రామానుజనేయులు, అన్నమయ్య జిల్లా లోని చెన్నరాజుపోడు గ్రామానికి చెందిన సుంకర శివకుమార్‌, కడప జిల్లా లోని రాయచోటి ప్రాంతానికి చెందిన గోపాల్‌ ఒక ముఠాగా ఏర్పడ్డారు. పొట్టకూటి కోసం గల్ఫ్‌ దేశాలకు వెళ్లే నిరక్షరాస్యులైన అమాయకులను లక్ష్యంగా చేసుకొన్న వీరు.... గల్ఫ్‌ లో ఉద్యోగాల పేరుతోనకిలీ వీసాల తయారీ దందాకు తెరలేపారు. ఈ మేరకు తప్పుడు దృవపత్రాలతో నకిలీ వీసాలు తయారు చేసే ఈ ముఠా.... ఉద్యోగాల ఎర వేసి వారికివిజిటింగ్‌ వీసాలు అంటగట్టి గల్ఫ్‌ దేశాలకు పంపించడం వృత్తిగా ఎంచుకున్నారు. ఈ మేరకు హైదరాబాద్‌ లోని నాంపల్లి ప్రాంతాల్లో పలు హోటల్స్‌ ను అడ్డాగా చేసుకుని గత కొంతకాలంగా వీరు ఈ దందాను సాగిస్తున్నారు.ఇందుకోసం ఒక్కో ప్రయాణికుడి నుండి  లక్షల్లో డబ్బులు వసూలు చేస్తున్నారు.ఈ క్రమంలో 8 మంది అమాయకులకు ఉద్యోగాల పేరుతోనకిలీ వీసాలు అంటగట్టి దుబాయ్‌ కి పంపించేందుకు ప్రయత్నించారు. వీరి మోసాలు గ్రహించలేకపోయిన అమాయకులు నకిలీ వీసాలు పట్టుకొని ఎడారి దేశానికి ఎగిరిపోవడానికి మే 14వ తేదీన శంషాబాద్‌ విమానాశ్రయానికి చేరుకున్నారు.అయితే శంషాబాద్‌ విమానాశ్రయంలో వీరి వీసాలను పరిశీలించిన అధికారులు.... వారి వద్ద ఉన్నవి ఫేక్‌ వీసాలుగా గుర్తించారు. దీంతో ప్రయాణికులను అదుపులోకి తీసుకొని శంషాబాద్‌ ఎయిర్‌ పోర్ట్‌ లోని ఔట్‌ పోస్టు పోలీసులకు అప్పగించారు.ఈ నేపథ్యంలో శంషాబాద్‌ జోన్‌ డీసీపీ బి.రాజేష్‌, సైబరాబాద్‌ ఎస్‌ఓటీ డీసీపీ పి.శోభన్‌ కుమార్‌ ఆదేశాల మేరకు ఎస్‌.ఓ.టి అడిషనల్‌ డీసీపీ శ్రీనివాస్‌ రెడ్డి,అడిషనల్‌ డీసీపీ కె ఎస్‌ రావు, శంషాబాద్‌ ఏసీపీ శ్రీకాంత్‌ గౌడ్‌ పర్యవేక్షణలోరంగంలోకి దిగిన ఎస్‌ఓటి టీమ్స్‌, ఎయిర్‌ పోర్ట్‌, ఆర్‌.జి.ఐ.ఏ పోలీసులు.... పట్టుబడ్డ ప్రయాణికులను అదుపులోకి తీసుకొని విచారించడంతో నకిలీ వీసాల తయారీ ముఠా గుట్టు రట్టయింది.ఈ మేరకు ఐదుగురు నిందితుల్లో ఏ3 నిందితుడిగా ఉన్న వెస్ట్‌ గోదావరి వాసి చిలుకూరి బాలాజీ తో పాటు అన్నమయ్య జిల్లాకు చెందిన ఏ 4 నిందితుడు సుంకర శివకుమార్‌ ను హైదరాబాద్‌ నాంపల్లిలోని త్రీ క్యాస్టల్‌ హోటల్లో అరెస్టు చేసినట్లు శంషాబాద్‌ ఏసీపీ శ్రీకాంత్‌ గౌడ్‌ ప్రకటించారు. పరారీలో ఉన్న మరో ముగ్గురు నిందితులు సత్యనారాయణ, అంజి, గోపాల్‌ కోసం ప్రత్యేక బృందాలతో గాలిస్తున్నట్లు ఆయన వివరించారు. పట్టుబడ్డ నిందితుల వద్ద నుండి 14 పాస్‌ పోర్టులు , 14 నకిలీ వీసాలు, 16 విమాన ప్రయాణ టికెట్లు, 2 నకిలీ స్టాంపులు, స్టాంప్‌ పాడ్‌, లాప్టాప్‌ తో పాటు 7 మొబైల్‌ ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు ఏసీపీ శ్రీకాంత్‌ గౌడ్‌ వెల్లడిరచారు. .ఎస్‌ఓటి టీమ్స్‌ మరియు పోలీసులకు ఏసీపీ ప్రశంస మరోవైపు నకిలీ వీసాల తయారీ ముఠా గుట్టును రట్టు చేసిన శంషాబాద్‌ ఎస్‌ఓటి టీమ్స్‌ తోపాటు శంషాబాద్‌ ఎయిర్పోర్ట్‌ ఔట్‌ పోస్ట్‌, ఆర్జిఐఏ  పోలీసులను ఏసీపీ శ్రీకాంత్‌ గౌడ్‌ అభినందించారు. ఈ మేరకు ఎస్‌ఓటి ఇన్స్పెక్టర్‌ సంజయ్‌ కుమార్‌, ఔట్‌ పోస్ట్‌ పోస్ట్‌ పీఎస్‌ ఇన్స్పెక్టర్‌ జె.బాలరాజు, ఆర్‌.జి.ఐ.ఏ పోలీస్‌ స్టేషన్‌ ఇన్స్పెక్టర్‌ కే బాలరాజు, ఎస్‌ఓటి ఎస్సై తరుణ్‌ రెడ్డి,ఎస్సై సిద్ధేశ్వర్‌ (ఎయిర్‌ పోర్ట్‌ ఔట్‌ పోస్ట్‌), ఎస్‌ఓటీపోలీస్‌ కానిస్టేబుల్స్‌ ఆంజనేయులు , వంశీకృష్ణ , జాన్సన్‌, ఆర్‌.జి.ఐ.ఏ ఔట్‌ పోస్ట్‌ పీఎస్‌ కానిస్టేబుల్స్‌ శివకుమార్‌, పి ధర్మారెడ్డి, కె రవికుమార్‌ కు ఏసీపీ శ్రీకాంత్‌ గౌడ్‌ రివార్డులు అందజేశారు.