NAGARA NIJAM - Nagaranijam

హైదరాబాద్‌లో మలబార్ గోల్డ్ & డైమండ్స్ యొక్క సీఎస్ఆర్ స్కాలర్‌షిప్ కార్యక్రమాన్ని ప్రారంభించిన తెలంగాణ ఐటీ శాఖా మంత్రి డి. శ్రీధర్ బాబు
హైదరాబాద్ , ఏప్రిల్ 22, (నగర నిజం) : ప్రపంచంలోనే ఐదవ అతిపెద్ద ఆభరణాల రిటైల్ సంస్థగా, ఒక బాధ్యతాయుతమైన ఆభరణాల బ్రాండ్‌గా గుర్తింపు పొందిన 'మలబార్ గోల్డ్ & డైమండ్స్', 2026–27 ఆర్థిక సంవత్సరానికి గాను తాము ప్రకటించిన రూ. 200 కోట్ల సీఎస్ఆర్ నిధుల కేటాయింపులో భాగంగా, తెలంగాణలోని 5,050 మంది విద్యార్థులకు రూ. 4.55 కోట్ల విలువైన స్కాలర్‌షిప్‌లను ఈ రోజు పంపిణీ చేసింది. హైదరాబాద్‌లోని ఓల్డ్ నల్లకుంటలో ఉన్న ఆర్టీసీ కళ్యాణ మండపంలో జరిగిన ఒక కార్యక్రమంలో ఈ స్కాలర్‌షిప్ పంపిణీ జరిగింది.జాతీయ స్థాయిలో, మలబార్ గోల్డ్ & డైమండ్స్ యొక్క సీఎస్ఆర్ కార్యక్రమం 20 రాష్ట్రాల్లోని 1,500కి పైగా ప్రాంతాలను కవర్ చేస్తుంది. ఈ ఏడాది దీని ద్వారా రెండు లక్షల మందికి పైగా లబ్ధి పొందుతారని అంచనా వేస్తున్నారు. విద్య, ఆరోగ్యం, మహిళా సాధికారత , పర్యావరణ పరిరక్షణ వంటి రంగాల్లో చేపట్టిన కార్యక్రమాలు, సామాజిక ప్రభావంపై ఈ సంస్థకు ఉన్న దీర్ఘకాలిక దృష్టి ద్వారా ఇప్పటికే 18 లక్షల మందికి ప్రయోజనం చేకూరింది. విద్యా రంగంలో, మలబార్ గోల్డ్ & డైమండ్స్ గత కొన్నేళ్లుగా 1.15 లక్షల మందికి పైగా విద్యార్థులకు రూ.100 కోట్లకు పైగా స్కాలర్‌షిప్ సహాయాన్ని అందించింది. 2026–27 ఆర్థిక సంవత్సరానికి గాను, తెలంగాణలోని 5,050 మంది విద్యార్థులతో సహా, భారతదేశవ్యాప్తంగా 33,000 మంది బాలికా విద్యార్థులకు స్కాలర్‌షిప్‌లను ఈ సంస్థ కేటాయించింది. బాలల విద్య పట్ల తమ  నిబద్ధతను మరింతగా పునరుద్ఘాటిస్తూ, ఈ సంస్థ ఇప్పటికే 17 రాష్ట్రాల్లో 1,543 సూక్ష్మ-అభ్యాస కేంద్రాలను (మైక్రో -లెర్నింగ్ సెంటర్స్) ఏర్పాటు చేసింది; ఒక లక్ష మందికి పైగా విద్యార్థులకు ప్రయోజనం చేకూర్చే లక్ష్యంతో, ఈ నెట్‌వర్క్‌ను 2,500 కేంద్రాలకు విస్తరించాలని యోచిస్తోంది.
ఆరోగ్యం, మహిళా సాధికారత, విద్య మరియు పర్యావరణ రంగాల్లో ఈ సంస్థ చేపట్టిన విస్తృత సీఎస్ఆర్ కార్యక్రమాల్లో భాగంగా, 'థనల్' (Thanal) మరియు 'ప్రథమ్' (Pratham) వంటి సంస్థలతో భాగస్వామ్యం కుదుర్చుకుని ఈ కార్యక్రమాలను అమలు చేస్తున్నారు.
హైదరాబాద్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో తెలంగాణ ప్రభుత్వ ఐటీ, ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్స్, పరిశ్రమలు మరియు వాణిజ్య శాఖల మంత్రి శ్రీ డి. శ్రీధర్ బాబు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఆయనతో పాటు మలబార్ గోల్డ్ & డైమండ్స్ సంస్థ ఇండియా ఆపరేషన్స్ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ ఆషర్ ఓ, 'రెస్ట్ అఫ్ ఇండియా ' రిటైల్ హెడ్ శ్రీ సిరాజ్ పి.కె, హైదరాబాద్ జోన్, జోనల్  హెడ్ శ్రీ షరీజ్ కె, ఇతర సీనియర్ ప్రతినిధులు, ఆహ్వానించబడిన ప్రముఖులు మరియు విద్యా రంగ నిపుణులు కూడా పాల్గొన్నారు.
ప్రాంతీయ స్థాయిలో, తెలంగాణ వ్యాప్తంగా గ్రూప్ యొక్క కార్పొరేట్ సామాజిక బాధ్యత (సీఎస్ఆర్) కార్యక్రమాలు స్కాలర్‌షిప్‌లకు మాత్రమే పరిమితం కాకుండా, విద్యా సహాయం, ఆకలి నిర్మూలన, మరియు నిత్యావసర వనరుల లభ్యత వంటి కార్యక్రమాలను కూడా కలిగి ఉన్నాయి. మలబార్ గోల్డ్ & డైమండ్స్, వీధి పిల్లలకు మద్దతుగా 49 సూక్ష్మ-అభ్యాస కేంద్రాలను నిర్వహిస్తోంది, తమ వీధి భోజన పంపిణీ కార్యక్రమం ద్వారా రోజుకు 2000కు పైగా భోజనాలను అందిస్తూ, క్షేత్రస్థాయిలో విద్య , పోషణ లభ్యతను మెరుగుపరచడానికి దోహదపడుతోంది.
ఈ కార్యక్రమంపై తెలంగాణ ప్రభుత్వ సమాచార సాంకేతికత, ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్స్, పరిశ్రమలు మరియు వాణిజ్య శాఖల మంత్రి శ్రీ డి. శ్రీధర్ బాబు మాట్లాడుతూ, “పరిశ్రమలు మరియు ఆవిష్కరణల ఆధారిత రంగాలలో తెలంగాణ పురోగమిస్తున్న తరుణంలో, ఈ పురోగతికి తోడ్పడే విద్యా పునాదిని బలోపేతం చేయడం కూడా అంతే ముఖ్యం. ఇటువంటి ప్రయత్నాలు, రాష్ట్రం యొక్క విస్తృత అభివృద్ధి ప్రయాణంలో ఎక్కువ మంది విద్యార్థులు పాల్గొనేలా చేయడం ద్వారా సమ్మిళిత అభివృద్ధికి పరిస్థితులను కల్పించడంలో సహాయపడతాయి” అని అన్నారు.
మలబార్ గ్రూప్ ఛైర్మన్ ఎం. పి. అహ్మద్ మాట్లాడుతూ, “వ్యక్తిగత మరియు సామాజిక స్థాయిలో దీర్ఘకాలిక ప్రభావాన్ని సృష్టించడానికి విద్య అత్యంత ప్రభావవంతమైన మార్గాలలో ఒకటిగా నిలుస్తుంది. మా స్కాలర్‌షిప్ కార్యక్రమాల ద్వారా, విజయం సాధించగల సామర్థ్యం ఉండి, తమ చదువులను కొనసాగించడానికి ఆర్థిక సహాయం అవసరమైన విద్యార్థులకు మద్దతు ఇవ్వాలని మేము లక్ష్యంగా పెట్టుకున్నాము” అని అన్నారు. ఈ గ్రూప్ యొక్క సీఎస్ఆర్ కార్యకలాపాలు విద్య, ఆకలి నిర్మూలన, ఆరోగ్య సంరక్షణ, గృహనిర్మాణం, మహిళా సాధికారత మరియు పర్యావరణ పరిరక్షణ వంటి రంగాలలో విస్తరించి ఉన్నాయి. ఈ కార్యక్రమాల కోసం గ్రూప్ తన నికర ట్రేడింగ్ లాభంలో ఐదు శాతాన్ని కేటాయిస్తుంది.
హైదరాబాద్‌లోని తెలంగాణ స్కాలర్‌షిప్ కార్యక్రమంతో, మలబార్ గోల్డ్ & డైమండ్స్ ప్రాంతీయ మార్కెట్లలో విద్యపై దృష్టి సారించిన తమ సీఎస్ఆర్ ప్రయత్నాలను బలోపేతం చేస్తూనే ఉంది, తద్వారా విద్యార్థులకు నిర్మాణాత్మక మరియు స్థిరమైన మద్దతును అందిస్తోంది.

మహేశ్వరం రెసిడెన్షియల్ పాఠశాల సందర్శించిన కలెక్టర్ సి. నారాయణ రెడ్డి
* హాస్టళ్లలో చిన్నపాటి మరమ్మతులకు శ్రీకారం… సంక్షేమ వారోత్సవాల్లో 3వ రోజు కార్యక్రమం విజయవంతం

రంగారెడ్డి, ఏప్రిల్ 22 (నగర నిజం): “ప్రజా పాలన - ప్రగతి ప్రణాలిక”లో భాగంగా నిర్వహిస్తున్న సంక్షేమ వారోత్సవాల్లో మూడవ రోజు కార్యక్రమంగా జిల్లాలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ సంక్షేమ హాస్టళ్లు మరియు రెసిడెన్షియల్ పాఠశాలల్లో చిన్నపాటి మరమ్మతులపై ప్రత్యేక దృష్టి సారించారు. ఈ సందర్భంగా అన్ని సంస్థల్లో తనిఖీలు నిర్వహించి, భవనాలు, పారిశుధ్యం, నీటి సరఫరా, విద్యుత్ పరికరాలు, వంటగదులు, టాయిలెట్ బ్లాక్‌లు, స్నానాల గదులు తదితర ప్రాథమిక సదుపాయాల్లో ఉన్న లోపాలను గుర్తించారు. గుర్తించిన మరమ్మతు అవసరాలను నమోదు చేసి, ప్రాధాన్యత క్రమంలో అమలు చేయాలని నిర్ణయించారు. ప్రభుత్వ భవనాలకు సంబంధించిన పనుల కోసం అంచనాలు సిద్ధం చేసి ఆమోదం కోసం పంపిస్తుండగా, ప్రైవేట్ భవనాల్లో ఉన్న వసతి గృహాల మరమ్మతులను ఈ నెల 24 నుంచి భవన యజమానులతో సమన్వయం చేసుకుని చేపట్టాలని సూచించారు. విద్యార్థులకు ఇబ్బందులు కలగకుండా వేసవి సెలవుల్లోనే పనులు పూర్తి చేయాలని ప్రణాళిక రూపొందించారు. ఇదిలా ఉండగా, మహేశ్వరం మహాత్మా జ్యోతిబా ఫూలే రెసిడెన్షియల్ పాఠశాలను జిల్లా కలెక్టర్ సి. నారాయణ రెడ్డి, అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) కె. శ్రీనివాస్ కలిసి సందర్శించారు. వసతి గృహాల్లో నెలకొన్న సమస్యలపై తక్షణ నివేదికలు సమర్పించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, వసతి గృహాల్లోని సమస్యలను గుర్తించి రిపోర్ట్ సిద్ధం చేయాలని, మెనూ ప్రకారం విద్యార్థులకు నాణ్యమైన ఆహారం అందించాలని సూచించారు. వేసవి సెలవుల్లోనే చిన్నపాటి సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని తెలిపారు. అనంతరం పాఠశాల వంటశాల, మెస్, పరిసరాలను పరిశీలించి విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. ఆహారం నాణ్యత, పరిశుభ్రతపై విద్యార్థుల అభిప్రాయాలు తెలుసుకున్నారు. ఎంసెట్ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులకు అందిస్తున్న కోచింగ్ వివరాలు అడిగి తెలుసుకుని అవసరమైన సూచనలు చేశారు. ఉపాధ్యాయులు నాణ్యమైన విద్య అందించి ప్రభుత్వ పాఠశాల విద్యార్థులను ఉన్నతస్థాయికి తీసుకెళ్లాలని కలెక్టర్ సూచించారు. ఉపాధ్యాయ వృత్తి గొప్పదని, రాబోయే తరాలను మంచి పౌరులుగా తీర్చిదిద్దే బాధ్యత తమపై ఉందని గుర్తుచేశారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ శ్రీనివాస్, బీసీ వెల్ఫేర్ అధికారి కేషు రామ్, తహశీల్దార్, పాఠశాల ప్రిన్సిపాల్ మరియు ఇతర అధికారులు పాల్గొన్నారు.

అడ్వకేట్‌పై పోలీస్ ప్రవర్తనపై ఆగ్రహం
హైదరాబాద్, ఏప్రిల్ 15 (నగర నిజం) : అడ్వకేట్ సుబ్బారావును పంజాగుట్ట సిఐ భయభ్రాంతులకు గురిచేసి డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్ష నిర్వహించడం పోలీస్ వ్యవస్థకు సిగ్గుచేటని సీనియర్ జర్నలిస్టు ఎర్రమను బాలరాజు విమర్శించారు.అడ్వకేట్ వృత్తికి గౌరవం ఇవ్వకుండా ఈ విధంగా ప్రవర్తించడం సరైనది కాదని ఆయన పేర్కొన్నారు. చట్టాన్ని అమలు చేసే బాధ్యత ఉన్న పోలీస్ అధికారులు ఇలాంటి చర్యలకు పాల్పడటం బాధాకరమని తెలిపారు.ఈ ఘటనపై రాష్ట్ర డిజిపి వెంటనే స్పందించి పంజాగుట్ట సిఐపై పూర్తి స్థాయి విచారణ చేపట్టి తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పోలీస్ వ్యవస్థపై ప్రజల్లో నమ్మకం నిలుపుకోవాలంటే ఇలాంటి ఘటనలపై కఠిన చర్యలు అవసరమని అన్నారు.

ప్రజ్ఞాపూర్ లో అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు
అంబేద్కర్ ఆశయాల సాధనకు కట్టుబడి పనిచేయాలి

జాంబవ యూత్ ప్రజ్ఞాపూర్ వారి ఆధ్వర్యంలో

గజ్వేల్ ప్రజ్ఞాపూర్, ఏప్రిల్ , 14,(నగర నిజం): భారత రాజ్యాంగ శిల్పి, సమానత్వానికి ప్రతీక, భారతరత్న డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 135వ జయంతి సందర్భంగా గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ ప్రజ్ఞాపూర్ లోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలవేసి జై భీమ్ నినాదాలతో చౌరస్తా అంత మార్మోగింది. జాంబవ యూత్ ప్రజ్ఞాపూర్ వారి ఆధ్వర్యంలో నిర్వహించిన జయంతి కార్యక్రమంలో ప్రజలు, యువత, నాయకులు భారీగా పాల్గొన్నారు.ఈ కార్యక్రమంలో జాంబవ యూత్ అధ్యక్షులు గజ్వేల్ సాయిలు, జనరల్ సెక్రెటరీ గుండ్ర యాదగిరి, దుర్గి చెక్పోస్ట్ రాజు, సోమ్ యాదగిరి, దుర్గి స్వామి ,దుర్గి శివకుమార్, తదితరులు పాల్గొన్నారు.

మదనాపూర్ మండలంలో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక యాక్షన్ ప్లాన్ సమావేశం
వనపర్తి,మదనాపూర్, ఏప్రిల్ 14 (నగర నిజం) : మదనాపూర్ ఎంపీడీవో కార్యాలయంలో మండల స్థాయి అధికారులతో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక యాక్షన్ ప్లాన్ పై సమగ్ర సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మండల స్థాయి రోడ్డు భద్రత కమిటీ, గ్రామ సభ కమిటీ అంశాలపై విస్తృతంగా చర్చించారు.సమావేశానికి ప్రత్యేక అధికారి ఎం.డి సీరజుద్దీన్ అహ్మద్ హాజరై మండల అభివృద్ధి కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేయాలని సూచించారు. ప్రజల సమస్యలను గ్రామ స్థాయిలోనే పరిష్కరించే విధంగా కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేయాలని అధికారులకు తెలిపారు.ఈ కార్యక్రమంలో ఎంపీడీవో ప్రసన్న కుమారి, ఎంపీవో హుస్సైనప్ప, గ్రామ పంచాయతీ కార్యదర్శులు, ఇతర సిబ్బంది పాల్గొన్నారు. మండలంలోని వివిధ అభివృద్ధి పనులు, రోడ్డు భద్రత చర్యలు, గ్రామ సభల నిర్వహణపై కార్యాచరణ ప్రణాళిక రూపొందించారు.

నూతన తహసీల్దార్ కు శుభాకాంక్షలుతెలిపిన తుంగతుర్తి రవి,అమర్ సింగ్
మేడిపల్లి,ఏప్రిల్10(నగరనిజం)మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా మేడిపల్లి మండల నూతన తహసీల్దార్‌గా బదిలీపై వచ్చిన ఎం. వెంకట నర్సింహా రెడ్డిని శుక్రవారంనాడు మండల రెవెన్యూ కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు మర్యాదపూర్వకంగా కలవటం జరిగింది.ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ పీర్జాదిగూడ అధ్యక్షులు,ఆర్.వి ఫౌండేషన్ చైర్మన్ తుంగతుర్తి రవి, మాజీ మేయర్ అమర్ సింగ్ నూతన తహసీల్దార్‌నుశాలువాతోసత్కరించి,వారికి శుభాకాంక్షలు తెలియజేసారు.ఈసందర్భంగావారుమాట్లాడుతూ...మండలపరిధిలోనిప్రజలసమస్యలపరిష్కారంలోతహసీల్దార్ చొరవ చూపాలనివారుకోరారు.ఈకార్యక్రమంలోమేడిపల్లి యూత్ కాంగ్రెస్అద్యక్షుడు చిలుముల అజయ్ రెడ్డి, మాజీ కార్పొరేటర్ అనంత రెడ్డి,కాంగ్రెస్నా యకులుబుచ్చియాదవ్,బండారురవీందర్,ఈశ్వర్ రెడ్డి,పెంటయ్య మాజీ కో ఆప్షన్ సభ్యులుఇర్ఫాన్ పార్టీ సీనియర్ నాయకులుమోహన్ కుమార్, మణిరాం నాయక్,తవిటి ప్రశాంత్,ఖాజా, తిరుపతి రెడ్డి, శివ, ఉదయ్ రాజ్ గౌడ్,బద్దం సాయి, వీరయ్య,పాల్గొనిశుభాకాంక్షలనుతెలియజేశారు.

పల్లవి మోడల్ స్కూల్‌లో ఘనంగా ఉచిత వైద్య శిబిరం
తిరుమలగిరి, 09 ఏప్రిల్ (నగర నిజం) :విద్యార్థుల విద్యాభ్యాసంతో పాటు వారి ఆరోగ్య పరిరక్షణే లక్ష్యంగా తిరుమలగిరిలోని పల్లవి మోడల్ స్కూల్ ఆవరణలో ఉచిత మెగా వైద్య శిబిరం ఘనంగా నిర్వహించారు. ప్రముఖ కిమ్స్ సన్‌షైన్ ఆసుపత్రుల సహకారంతో నిర్వహించిన ఈ శిబిరంలో విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని వైద్య సేవలను వినియోగించుకున్నారు.ఈ శిబిరంలో భాగంగా నిపుణులైన వైద్య బృందం ద్వారా ఎముకలు, కీళ్ల సంబంధిత పరీక్షలు నిర్వహించగా, కంటి పరీక్షలు, దంత పరీక్షలు, రక్తపోటు, చక్కెర స్థాయిలు పరీక్షలు చేపట్టారు. అవసరమైన వారికి ఈసీజీ పరీక్షలు కూడా ఉచితంగా నిర్వహించారు. ప్రతి ఒక్కరికి వ్యక్తిగతంగా వైద్య సూచనలు అందిస్తూ ఆరోగ్యకరమైన జీవన విధానంపై అవగాహన కల్పించారు.వ్యాధులు రాకముందే నివారణ చర్యలు చేపట్టడం, చిన్న వయస్సులోనే ఆరోగ్య సమస్యలను గుర్తించడం ఈ శిబిరం ప్రధాన ఉద్దేశమని పాఠశాల యాజమాన్యం తెలిపింది. ఈ కార్యక్రమం ద్వారా అనేక కుటుంబాలకు నాణ్యమైన వైద్య సేవలు అందుబాటులోకి వచ్చాయని పేర్కొన్నారు.అలాగే పాఠశాలలో చేరాలనుకునే కుటుంబాలకు ఈ శిబిరం ఒక మంచి అవకాశం కల్పించిందని తెలిపారు. వారు పాఠశాల వాతావరణాన్ని పరిశీలించి, ఉపాధ్యాయులతో మాట్లాడే అవకాశం పొందారు.విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధికి ఇటువంటి సామాజిక బాధ్యతతో కూడిన కార్యక్రమాలు ఎంతో ఉపయోగపడతాయని తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేశారు. ఈ శిబిరానికి సహకరించిన వైద్య బృందానికి పాఠశాల యాజమాన్యం కృతజ్ఞతలు తెలిపింది.

మధురై హైకోర్టు సంచలన తీర్పు…
మధురై, ఏప్రిల్ 6 (నగర నిజం) : తమిళనాడులో సంచలనం సృష్టించిన జయరాజ్–బెనెక్స్ లాకప్ మృతి కేసులో మధురై హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. ఈ కేసులో దోషులుగా తేలిన 9 మంది పోలీసులకు మరణశిక్ష విధిస్తూ కోర్టు కఠిన నిర్ణయం తీసుకుంది.2020లో లాక్‌డౌన్ సమయంలో జయరాజ్, అతని కుమారుడు బెనెక్స్ తమ మొబైల్ దుకాణాన్ని నిర్ణయించిన సమయం కంటే ఎక్కువసేపు తెరిచి ఉంచినట్లు ఆరోపణలతో పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం పోలీస్ స్టేషన్‌లో తీవ్ర చిత్రహింసలకు గురిచేయడంతో ఇద్దరూ మరణించిన ఘటన దేశవ్యాప్తంగా ఆగ్రహం రేపింది.ఈ ఘటనపై విచారణ కొనసాగగా, సంబంధిత పోలీసులపై హత్య, దౌర్జన్యానికి సంబంధించిన ఆరోపణలు నిరూపితమయ్యాయి. కేసు తీవ్రతను దృష్టిలో ఉంచుకుని కోర్టు ఈ తీర్పును వెల్లడించింది.ఈ తీర్పుతో బాధిత కుటుంబానికి న్యాయం జరిగినట్టుగా భావిస్తున్నప్పటికీ, దేశవ్యాప్తంగా పోలీస్ వ్యవస్థపై మరోసారి చర్చ మొదలైంది. కస్టడీ మరణాలపై కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరాన్ని ఈ సంఘటన మళ్లీ గుర్తు చేసింది.

*సామాజిక సంస్కర్త బాబు జగ్జీవన్‌రామ్‌*
బాబు జగ్జీవన్‌ రామ్‌ భారతదేశ చరిత్రలో ఒక గొప్ప నాయకుడు,స్వాతంత్య్ర సమరయోధుడు.ప్రజలు ఆయనపై ప్రేమతో ”బాబు జీ” అని పిలుస్తారు.అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం జీవితాంతం కృషిచేసిన మహానుభావుడు.భారత పార్లమెంటులో నలభై ఏళ్ళ పాటు వివిధ మంత్రి పదవులు నిర్వహించడమే కాకుండా ఉపప్రధానిగా వ్యవహరించాడు. 1935లో అంటరాని వారికి సమానత్వం కోసం అంకితమైన ఆల్‌ ఇండియా డిప్రెస్డ్‌ క్లాసెస్‌ లీగ్‌ అనే సంస్థను స్థాపించడంలో అతను కీలక పాత్ర పోషించాడు.1937లో బీహార్‌ శాసనసభకు ఎన్నికయ్యాడు,ఆ తర్వాత గ్రామీణ కార్మిక ఉద్యమాన్ని నిర్వహించాడు.1908 ఏప్రిల్‌ 5న బీహార్‌లోని చంద్వా గ్రామంలో సాధారణ కుటుంబంలో జన్మించిన జగ్జీవన్‌ రామ్‌ చిన్ననాటి నుంచే కష్టాలను ఎదుర్కొన్నారు.అణగారిన వర్గానికి చెందిన కారణంగా సమాజంలో వివక్షను ఎదుర్కోవాల్సి వచ్చింది.అయినప్పటికీ,ఆయనలో ఉన్న ధైర్యం,పట్టుదల వల్ల ఎప్పుడూ వెనుకడుగు వేయలేదు.బాబుజీ చిన్నప్పటి నుంచే తెలివైన విద్యార్థిగా ప్రసిద్ధి చెందారు.ఆయన గ్రామ పాఠశాలలో చదువు ప్రారంభించి,తరువాత ఉన్నత విద్య కోసం బనారస్‌ హిందూ యూనివర్సిటీలో చేరారు.అక్కడ కూడా కుల వివక్షను ఎదుర్కొని తన విద్యను కొనసాగించారు.అనంతరం ఆయన యూనివర్సిటీ అఫ్‌ కలకత్తాలో చేరి ఉన్నత విద్యను పూర్తిచేశారు.విద్యార్థి దశలోనే ఆయన సమాజంపై అవగాహన పెంచుకొని దేశభక్తి భావనలు బలపరుచుకున్నారు.మహాత్మాగాంధీ ప్రభావంతో స్వాతంత్య్ర ఉద్యమంలో చేరారు.బ్రిటిష్‌ పాలనకు వ్యతిరేకంగా పోరాడుతూ దేశ స్వాతంత్య్రం కోసం కృషి చేశారు.తర్వాత కాంగ్రెస్‌ పార్టీలో చేరి ప్రజలను చైతన్యపరిచారు.అణగారిన వర్గాల సమస్యలను స్వాతంత్య్ర పోరాటంతో కలిపి ముందుకు తీసుకెళ్లడం ఆయన ప్రత్యేకత.సమానత్వం,న్యాయం కోసం ఆయన నిరంతరం పోరాటం చేశారు.దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తరువాత బాబు జగ్జీవన్‌ రామ్‌ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించారు.ఆయన అనేక ముఖ్యమైన మంత్రిత్వ శాఖలను నిర్వహించారు.కార్మిక శాఖ, రవాణా కమ్యూనికేషన్‌ శాఖ,ఆహార,వ్యవసాయ శాఖ, రక్షణశాఖ మంత్రిగా సేవలందించారు.ఈ పదవుల్లో పనిచేసేటప్పుడు ఆయన ప్రజల సమస్యలను అర్థం చేసుకుని వాటికి పరిష్కారాలు కనుగొనే ప్రయత్నం చేశారు.1971లో జరిగిన ఇండో-పాకిస్తాన్‌ వార్‌ సమయంలో 1971 సమయంలో బాబుజీ రక్షణ మంత్రిగా ఉన్నారు.ఈ యుద్ధంలో భారతదేశం విజయం సాధించడంలో ఆయన కీలక నిర్ణయాలు తీసుకున్నారు.సైన్యానికి ధైర్యం నింపుతూ దేశ రక్షణలో పాల్గొన్నారు.1977-1979 కాలంలో భారత దేశ ఉప ప్రధానిగా సేవలందించారు.తరువాత మొరార్జీ దేశాయ్ నాయకత్వంలోని ప్రభుత్వంలో ఉప ప్రధానిగా పనిచేశారు.ఈ కాలంలో దేశంలో ‘అత్యవసర’పరిస్థితి అనంతరం ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించడం చాలా ముఖ్యమైన పని.బాబుజీ ఈ బాధ్యతను సమర్థంగా నిర్వహించారు.ప్రభుత్వ వ్యవస్థను బలపరచడంలో ఆయన కృషి ఎంతో గొప్పది.బాబుజీ సామాజిక సేవ,దళితుల అభ్యున్నతి కోసం అంకితభావంతో పనిచేశారు.సమాన హక్కులు,విద్య,ఉపాధి అవకాశాల కోసం పోరాడారు.అణగారిన వర్గాలకు ప్రోత్సాహమిచ్చి,సమాజంలో గౌరవప్రదమైన స్థానం కల్పించేందుకు కృషి చేశారు.ఆయన నాయకత్వం వల్ల దళితులు,వెనుకబడిన వర్గాలకు కొత్త ఆశలు కలిగాయి.ఆయన్ను సామాజిక సంస్కర్తగా కూడా భావిస్తారు.కష్టపడి పనిచేయడం,ధైర్యం,పట్టుదల,సమానత్వ భావన,సేవా దృక్పథం నిజాయితీ గల లక్షణాలు ఆయన్ను ప్రజల హృదయాలలో చిరస్థాయిగా నిలిపాయి.బాబుజీ 1986 జూలై 6న మరణించారు.ఆయన మరణం భారతదేశానికి పెద్ద లోటు.అయినప్పటికీ,ఆయన చేసిన సేవలు,ఆలోచనలు నేటికీ ప్రజలకు మార్గదర్శకంగా ఉన్నాయి.ఆయన జీవితం మనకు కష్టపడితే ఏదైనా సాధ్యమని,సమాజానికి సేవ చేయడం గొప్ప ధర్మమని నేర్పుతుంది.ఈ సందర్భంగా బాబూజీని స్మరించుకోవడం ప్రతి భారతీయుని బాధ్యత.

ఉచిత వైద్య శిబిరం నిర్వహణ
సికింద్రాబాద్, 4 ఏప్రిల్ (నగర నిజం) : ఉత్తర లాలాగూడ అడ్డగుట్ట డివిజన్ పరిధిలోని బడి మసీదు ప్రాంతం సమీపంలో యూపీహెచ్సీ తుకారంగేట్ , బిఆర్ఎస్ నాయకులు ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కాలనీ నివాసులు పెద్ద సంఖ్యలో హాజరై వైద్య సేవలు పొందారు.శిబిరంలో సాధారణ ఆరోగ్య పరీక్షలతో పాటు రక్తపోటు, షుగర్, జ్వరం వంటి వ్యాధుల నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. అవసరమైన వారికి ఉచిత మందులు అందజేశారు. ముఖ్యంగా వృద్ధులు, మహిళలు, చిన్నారులు అధికంగా పాల్గొని వైద్యుల సలహాలు తీసుకున్నారు.వైద్య సిబ్బంది ప్రజలకు సీజనల్ వ్యాధులు, పరిశుభ్రత, సరైన ఆహారం, వ్యాయామం వంటి అంశాలపై అవగాహన కల్పించారు. అనారోగ్య సమస్యలు తలెత్తిన వెంటనే సమీప ఆరోగ్య కేంద్రాన్ని సంప్రదించాలని సూచించారు.ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు పాల్గొని శిబిరాన్ని సందర్శించారు. శ్రీనివాస్ గౌడ్, అమర్ బన్సోడే, గోనే శ్రీనివాస్ తదితరులు ప్రజలతో మాట్లాడి ఇలాంటి శిబిరాలు తరచూ నిర్వహించడం అవసరమని తెలిపారు.ఎఎన్ఎమ్ ఎన్. సుదీవెన పర్యవేక్షణలో ఆశా కార్యకర్తలు జి.ఉమ, రాధిక, జె. దేవిక శిబిరం నిర్వహణలో కీలక పాత్ర పోషించారు. స్థానిక ప్రజలు ఇలాంటి ఉచిత వైద్య శిబిరాలు నిర్వహించినందుకు నిర్వాహకులకు కృతజ్ఞతలు తెలిపారు.

సికింద్రాబాద్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే, మాజీ కార్పొరేటర్ చొరవతో
సికింద్రాబాద్, 4 ఏప్రిల్ (నగర నిజం) : సికింద్రాబాద్ నియోజకవర్గం ఎమ్మెల్యే పద్మారావు గౌడ్, అడ్డగుట్ట డివిజన్ మాజీ కార్పొరేటర్ లింగాన్ని ప్రసన్న లక్ష్మీ శ్రీనివాస్ ఆదేశాల మేరకు సికింద్రాబాద్ నియోజకవర్గంలోని ఉత్తర లాలగూడ అడ్డగుట్ట డివిజన్ పరిధిలో లిల్లీ మోడల్ పాఠశాల సమీపంలోని ఐస్ ఫ్యాక్టరీ వద్ద కొత్త కాలువ పైప్‌లైన్ పనులు ప్రారంభమయ్యాయి. ఈ పనులు స్థానిక ప్రజలకు శుభ్రత, పారిశుధ్య సౌకర్యాలు మెరుగుపరచడం లక్ష్యంగా చేపట్టినట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్ బృందం, నీటి సరఫరా శాఖ సిబ్బంది కలిసి పనులను ప్రారంభించారు. స్థానిక ప్రజల సమస్యలను దృష్టిలో ఉంచుకొని కాలువ వ్యవస్థను ఆధునీకరించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో శ్రీనివాస్ గౌడ్, అమర్ బన్సోడ్, పొన్నాల రాజు, ఆశం, వెంకటేష్, పర్వేజ్, ఖాసిం, చిన్న పాల్గొన్నారు.

బాబు జగ్జీవన్ రామ్ జయంతి ఉత్సవాలకు ఆహ్వానం
లాలాపేట, 31 మార్చి (నగర నిజం) : శాంతినగర్ చౌరస్తాలో ఏప్రిల్ 5న నిర్వహించనున్న దేశ మాజీ ఉప ప్రధానమంత్రి డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలను సమతా దివస్‌గా ఘనంగా నిర్వహించనున్నట్లు ఉత్సవ కమిటీ ప్రకటించింది. ఈ కార్యక్రమానికి హాజరుకావాలని సికింద్రాబాద్ ఎమ్మెల్యే టి పద్మారావు గౌడ్‌ను ఉత్సవ కమిటీ నాయకులు ఆహ్వానించారు.సోమవారం కమిటీ సభ్యులు ఎమ్మెల్యేను కలిసి ఆహ్వాన పత్రికను అందజేశారు. అదే విధంగా ఎమ్మార్పిఎస్ అధినేత మంద కృష్ణ మాదిగను కూడా కలిసి కార్యక్రమానికి రావాలని కోరారు.ఈ కార్యక్రమంలో ఉత్సవ కమిటీ నాయకులు ముత్యాల గీతా దయాకర్, కుమార్ షాను, లక్ష్మీ ఆనంద్, కరుణాకర్, అనురుధ్, సతీష్, సాండీ తదితరులు పాల్గొన్నారు.